Pre market analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ
Pre market analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock market | గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా కదలాడుతున్నాయి. సోమవారం అమెరికాకు చెందిన నాస్‌డాక్‌ 0.10 శాతం నష్టపోగా.. ఎస్‌అండ్‌పీ(S&P) 0.06 శాతం పాజిటివ్‌గా క్లోజ్‌ అయ్యింది. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం సోమవారం 0.14 శాతం నష్టంతో కొనసాగుతోంది.

Stock market | యూరోప్‌ మార్కెట్లు..

యూరోప్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సీఏసీ(CAC) 0.50 శాతం లాభపడగా.. డీఏఎక్స్‌ 0.13 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.02 శాతం పెరిగాయి.

Stock market | లాభాల్లో ఆసియా మార్కెట్లు..

ఆసియా మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కోస్పీ(KOSPI) 0.77 శాతం లాభంతో కొనసాగుతుండగా.. తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.72 శాతం, హంగ్‌సెంగ్‌ 0.63 శాతం, స్ట్రేయిట్స్‌ టైమ్స్‌ 0.49 శాతం లాభంతో ఉన్నాయి. షాంఘై స్వల్ప నష్టాలతో ఉంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.15 శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు స్వల్ప గ్యాప్‌ అప్‌లో లేదా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Stock market | గమనించాల్సిన అంశాలు..

  • అమెరికాతో వాణిజ్య యుద్ధం(Trade war) నేపథ్యంలో చైనా భారత్‌ వైపు చూస్తోంది. మన దేశంనుంచి దిగుమతులు(Imports) పెంచుకుని ట్రేడ్‌ బ్యాలెన్స్‌ చేసుకోవాలని యోచిస్తోంది.
  • యూకే(UK)తో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై భారత్‌ దృష్టి సారించింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ లండన్‌ వెళ్లి అక్కడి ప్రముఖ పారిశ్రామిక వేత్తలను కలుస్తున్నారు.
  • ఈరోజు బజాజ్‌ ఫైనాన్స్‌(Bajaj finance), బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, విశాల్‌ మెగామార్ట్‌, బీపీసీఎల్‌, ట్రెంట్‌, అంబుజా సిమెంట్‌, స్టార్‌ హెల్త్‌ వంటి కంపెనీలు నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా స్టాక్స్‌లో వొలటాలిటీ ఉండే అవకాశం ఉంది.
  • ఎఫ్‌ఐఐలు వరుసగా తొమ్మిదో ట్రేడింగ్‌ సెషన్‌(Trading session)లోనూ నెట్‌ బయ్యర్లుగా నిలిచారు. సోమవారం నికరంగా రూ. 2,454 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు సైతం నికరంగా రూ. 2,817 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
  • రూపాయి విలువ డాలర్‌తో 42 పైసలు తగ్గి 85.03 వద్ద కొనసాగుతోంది.
  • డాలర్‌ ఇండెక్స్‌ 0.07 శాతం పెరిగి 99.08 వద్ద ఉంది.
  • యూఎస్‌ 10 ఇయర్స్‌ బాండ్‌ ఈల్డ్‌(Bond yield) 1.31 శాతం పెరిగి 4.21 వద్ద ఉంది.
  • క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.48 శాతం పెరిగి 61.75 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • దేశీయ స్టాక్‌ మార్కెట్లలో సోమవారం వొలటాలిటీ(Volitility) స్వల్పంగా తగ్గింది. వొలటాలిటీ ఇండెక్స్‌ 1.27 శాతం పెరిగి, 16.94 వద్ద ఉంది. విక్స్‌ తగ్గడం బుల్స్‌కు అనుకూల పరిణామం.