ePaper
More
    HomeతెలంగాణBC girls hostel | బీసీ బాలికలపై హాస్టల్​ సిబ్బంది టార్చర్​.. వార్డెన్​ కొడుకు లైంగిక...

    BC girls hostel | బీసీ బాలికలపై హాస్టల్​ సిబ్బంది టార్చర్​.. వార్డెన్​ కొడుకు లైంగిక వేధింపులు!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: BC girls hostel : వారంతా నిరుపేద అభాగ్య బాలికలు.. ఉన్నత చదువులు చదువుకోవాలనే తపనతో సర్కారు కల్పించిన వసతి గృహంలో వసతి పొందుతున్నారు. కానీ, వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన వార్డెన్​, సిబ్బందే.. ఆ అమాయక బాలికలను రాచి రంపాన పెడుతున్నారు. బజారు మనుషుల కంటే హీనంగా చూస్తున్నారు.

    సభ్య సమాజం తలదించుకునే మాటలతో వారిని వేధిస్తున్నారు. దీనికితోడు వార్డెన్ కుమారుడే వారి పట్ల కీచకుడిగా మారాడు. మానసికంగా, శారీరకంగా తీవ్ర హింసకు గురవుతున్న వారిని రక్షించేవారే లేకుండా పోయారు.

    పటిష్ఠమైన రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, విద్యార్థి సంఘాలు కూడా వారి కష్టాలను పట్టించుకున్న పాపాన పోకపోవడం ఆందోళనకరం. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.

    తెలంగాణ రాష్ట్రం Telangana state లోని నారాయణఖేడ్ పట్టణంలో ఉన్న బీసీ బాలికల హాస్టల్​లో అమ్మాయిలు తీవ్ర హింసకు గురవుతున్నారు. వార్డెన్​తోపాటు సిబ్బంది వారిని తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ మానసిక వేదనకు గురిచేస్తున్నారు. దీనికితోడు వార్డెన్​ కుమారుడు లైంగిక వేదింపులకు పాల్పడటంతో బాధిత బాలికలు తీవ్ర అభద్రతాబావంతో ఆందోళన చెందుతున్నారు. వారి టార్చర్​ భరించలేక తాజాగా బాలికలు పోలీసు స్టేషన్​ మెట్లు ఎక్కి తన గోడు వెల్లబోసుకోవడంతో విషయం వెలుగుచూసింది.

    BC girls hostel : కీచకుడిగా మారిన వార్డెన్​ కొడుకు..

    నారాయణ్​ఖేడ్​ Narayankhed బీసీ హాస్టల్​లో బాలికల పట్ల కాంగ్రెస్ పార్టీ Congress party మాజీ కౌన్సిలర్ రాజేశ్​ కీచకుడిగా మారాడు. రాజేశ్​

    రోజూ తాగొచ్చి తమపై చేయి వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, రాజేశ్​ అదే హాస్టల్​ వార్డెన్​ శారద కుమారుడు కావడం గమనార్హం.

    ఈ మేరకు రాజేశ్​ హాస్టల్​కు వచ్చి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని పోలీసులకు బాధిత బాలికలు ఫిర్యాదు చేశారు. రాజేష్ తమను అసభ్యకరంగా తాకుతున్నాడని హాస్టల్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే.. అన్న లాంటి వాడే ఏం అవ్వదు అంటూ తిరిగి తమను తిట్టినట్లు బాధితులు వాపోయారు.

    రాజేష్ ప్రవర్తన విషయంలో అతడి తల్లి శారదకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాజేష్ అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. తమను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ పోలీసులకు బాలికలు విన్నవించారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...