ePaper
More
    HomeజాతీయంVice President | ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా..

    Vice President | ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా..

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice President : ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్​ (Vice President Jagdeep Dhankhad) తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం (జులై 21) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) కు పంపించారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

    తన రాజీనామా సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తోపాటు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, జగదీప్ ధన్కడ్ జులై 16,2022 న ఉపరాష్ట్రపతిగా నియమితులయ్యారు. ఉపరాష్ట్రపతితోపాటు రాజ్యసభ (Rajya Sabha) ఛైర్మన్​ (Chairman) గా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వర్తించారు.

    Vice President : రైతు కుటుంబం నుంచి..

    జగదీప్​ స్వరాష్ట్రం రాజస్థాన్ (Rajasthan).​ ఇక్కడి మారుమూల గ్రామమైన కితానాలోని సాధారణ రైతు కుటుంబంలో మే 18, 1951న జన్మించారు. చిత్తోడ్ ఘఢ్ సైనిక్ పాఠశాల (Chittodgarh Sainik School) లో ప్రాథమిక విద్య అభ్యసించారు. జైపూర్​(Jaipur)లోని రాజస్థాన్ వర్సిటీ (Rajasthan University)లో ఎల్​ఎల్​బీ చేశారు.

    Vice President : రాజకీయ ప్రవేశం..

    9వ లోక్​సభ ఎన్నికల్లో (Lok Sabha elections) ఝుంఝును స్థానం (Jhunjhunu constituency) నుంచి జనతాదళ్ (Janata Dal) తరఫున జగదీప్ ధన్కడ్​ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. కిషన్ ఘడ్ అసెంబ్లీ స్థానం (Kishangarh assembly constituency) నుంచి 1993లో ఎమ్మెల్యే (MLA) గా ఎన్నికయ్యారు. 2003లో బీజేపీలో చేరారు. 2019లో బెంగాల్ (Bengal) గవర్నర్ (Governor) గా నియమితులయ్యారు.

    Vice President : సుప్రీంకోర్టు అడ్వకేట్​గా..

    రాజస్థాన్ Rajasthan హైకోర్టు బార్ అసోషియేషన్ (High Court Bar Association) అధ్యక్షులుగా జగదీప్ ధన్కడ్​ బాధ్యతలు నిర్వర్తించారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్​ (International Court of Arbitration) సభ్యులుగానూ చేశారు. కొన్ని రోజులపాటు సుప్రీంకోర్టు (Supreme Court) లోనూ అడ్వకేట్ (Advocate) ​గా ఉన్నారు.

    జగదీప్​ ధన్కడ్ గత మూడేళ్ల పాటు ఉప రాష్ట్రపతి పదవిలో ఉన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. ఏ మార్గంలోనంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...