ePaper
More
    HomeతెలంగాణHyderabad | ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్​లో మరో బస్టాండ్​ నిర్మాణం

    Hyderabad | ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్​లో మరో బస్టాండ్​ నిర్మాణం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలో ప్రస్తుతం రెండు బస్టాండ్లు అందుబాటులో ఉన్నాయి. మహాత్మ గాంధీ బస్​ స్టేషన్​ (ఎంజీబీఎస్​) (Mahatma Gandhi Bus Station), జూబ్లీ బస్టాండ్​ (జేబీఎస్​) (Jubilee Bus Stand) ఉన్నాయి. ఈ రెండు ప్రయాణ ప్రాంగణాల నుంచే రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నడుస్తాయి. అయితే నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో రద్దీ కూడా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం మహా నగరంలో మరో బస్టాండ్​ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ (Transport Minister Ponnam Prabhakar) ఓ టీవీ చానెల్​తో కొత్త బస్టాండ్​ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

    హైదరాబాద్​ నగరంలో (Hyderabad city) మొదట ఎంజీబీఎస్ ఏర్పాటు చేశారు. ఇది నగరం మధ్యలో ఉంటుంది. దీనిని ఇమ్లిబన్​ బస్టాండ్​ అని కూడా పిలుస్తారు. ఇది దేశంలోనే ఐదో పెద్ద బస్టాండ్​ కావడం గమనార్హం. అయితే ఎంజీబీఎస్​ నగరంలో మధ్యలో ఉండడంతో రద్దీ తగ్గించడానికి జేబీఎస్​ ఏర్పాటు చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే బస్సులు ఎక్కువ శాతం జేబీఎస్​ వరకు నడుస్తాయి. అయితే ప్రస్తుతం నగరంలో జనాభా పెరగడంతో మరో బస్టాండ్​ నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్​ తెలిపారు.

    Hyderabad | ఆరాంఘర్​ ప్రాంతంలో..

    మహబూబ్​నగర్, నల్గొండ, వికారాబాద్​​ వైపు వెళ్లే ప్రజల సౌకర్యార్థం ప్రస్తుతం బస్టాండ్​ నిర్మించాలని యోచిస్తున్నట్లు పొన్నం తెలిపారు. ఆరాంఘర్​ ప్రాంతంలో నిర్మించాలని ప్రణాళిక రూపొందించామన్నారు. ఆ ప్రాంతం కాకపోతే మరో ప్రాంతంలో అయిన శంషాబాద్​ ఎయిర్​ పోర్టుకు (Shamshabad Airport) దగ్గరగా ఉండేలా బస్టాండ్​ నిర్మిస్తామన్నారు. అన్ని వసతులతో దీనిని ఏర్పాటు చేస్తామన్నారు. ఫోర్త్​ సిటీలో కూడా బస్టాండ్​, బస్​డిపో ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. బస్సుల రద్దీ పెరగడంతో ఆ మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...