ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Mla Rakesh reddy | విద్యార్థులు ధైర్యంగా ఉండాలి: ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి

    Mla Rakesh reddy | విద్యార్థులు ధైర్యంగా ఉండాలి: ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్‌: Mla Rakesh reddy | విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఉండేలా ఉపాధ్యాయులు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాలని ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి సూచించారు. పట్టణంలోని పిప్రి రోడ్‌లో (Pipri road) వేల్పూర్‌ సాంఘిక సంక్షేమ వసతిగృహాన్ని (Velpur Social Welfare Hostel) ఆయన సోమవారం పరిశీలించారు. రెండు రోజుల క్రితం వసతిగృహంలో ఉంటున్న ఇంటర్‌ విద్యార్థి గడ్డం సంతోష్‌ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలను ఉపాధ్యాయులు, సిబ్బందిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.

    Mla Rakesh reddy | సౌకర్యాల విషయమై ఆరా..

    వసతిగృహంలో ఉపాధ్యాయుల హాజరు పట్టిక​ను ఎమ్మెల్యే పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ.. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఉండాలని సూచించారు. ఉన్నతాధికారులకు సమస్యను తెలిపితే పరిష్కార మార్గాలు తెలియజేస్తారని వివరించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు బాలు, గంధం నవీన్, పాన్‌ శ్రీను, ఉదయ్‌ గౌడ్, కలిగోట ప్రశాంత్, అధికారులున్నారు.

    అధికారులతో చర్చిస్తున్న ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...