ePaper
More
    Homeక్రీడలుWTC Finals | ఐసీసీ నిర్ణ‌యంతో నిరాశ‌లో భార‌త్.. 2031 వరకు WTC ఫైనల్స్ అక్కడే..!

    WTC Finals | ఐసీసీ నిర్ణ‌యంతో నిరాశ‌లో భార‌త్.. 2031 వరకు WTC ఫైనల్స్ అక్కడే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: WTC Finals | ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్స్‌కు సంబంధించి వేదికలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (International Cricket Council) ఖరారు చేసింది. ఈ మేరకు 2027, 2029, 2031 సంవత్సరాల్లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్య హక్కులు పొందింది. దీంతో ఈసారి సైతం భారత్‌కు నిరాశ తప్పలేదు. ఇప్పటివరకు నిర్వహించారు. మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్(WTC Finals) అన్నీ ఇంగ్లాండ్‌లోనే నిర్వహించబడ్డాయి. 2021లో సౌతాంప్టన్, 2023లో ఓవల్, 2025లో లార్డ్స్ వేదికగా జరిగాయి. త‌ర్వాతి మూడు ఫైనల్స్ కూడా ఇంగ్లాండ్‌ వేదికలకే వెళ్లడంతో ఈసీబీ (ECB) ఆధిపత్యం మరోసారి స్పష్టమైంది. ICC ప్రకారం, ఈసీబీ గత ఫైనల్స్‌ను విజయవంతంగా నిర్వహించిన ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

    READ ALSO  Sarfaraz Khan | రెండు నెల‌ల్లో 17 కేజీల బ‌రువు త‌గ్గిన టీమిండియా స్టార్.. ఎంత మారిపోయాడు..!

    WTC Finals | ఛాన్స్ మిస్..

    రానున్న‌ మూడు ఫైనల్స్‌లో కనీసం ఒకదానికైనా భారత్ ఆతిథ్యమివ్వాలని బీసీసీఐ (BCCI) ప్రయత్నించింది. ప్రత్యేకంగా ఐసీసీ చైర్మన్‌గా జై షా(Jay Shah ICC Chairman) ఉన్న సమయంలో భారత్‌కు అవకాశం కల్పించాలన్న ఆశలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ, ICC దీనికి సహకరించలేదు. ఆదివారం జరిగిన సమావేశంలో అధికారికంగా ఈ నిర్ణయం తీసుకుని, భారత్‌కు నిరాశ కలిగించింది. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ & వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్(Chief Executive Richard Gould) మాట్లాడుతూ.. తదుపరి మూడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు ఇంగ్లాండ్ (England) ఆతిథ్యం ఇవ్వడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇక్కడి ప్రేక్షకులకు టెస్ట్ క్రికెట్ పట్ల ఉన్న అభిమానం చాలా గొప్పది. ప్రపంచం నలుమూలల నుంచి అభిమానులు ఈ పోటీల కోసం ఇక్కడికి వచ్చి వీక్షించడం టెస్ట్ మ్యాచ్‌(Test Match)ల‌పై ఉన్న ఆస‌క్తి ఎలాంటిదో తెలియ‌జేస్తుంది.

    READ ALSO  Luke Hollman | ల‌గాన్ షాట్‌ని దింపేశాడుగా.. ఈ షాట్ చూస్తే ప‌డిప‌డి న‌వ్వుకుంటారు..!

    2025లో లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికా, డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ గెలిచింది. ఆ మ్యాచ్‌కు నాలుగు రోజుల్లో 1,09,227 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. అంతేకాదు, ఈ మ్యాచ్‌కు 225 మిలియన్ల డిజిటల్ వ్యూస్ వచ్చాయని ICC ఇటీవల వెల్లడించింది. మునుపటి ఎడిషన్లను ఎలా విజయవంతం చేశామో, అదే స్థాయిలో రాబోయే ఫైనల్స్‌కి కూడా సన్నద్ధం కావాలని మేము ఎదురుచూస్తున్నాం అని గౌల్డ్ తెలిపారు. కాగా, డబ్ల్యూటీసీ 2019లో ప్రారంభమైంది. ఇప్పటివరకు జరిగిన ఫైనల్స్‌లో భారత్ రెండు సార్లు ఫైనల్‌కు చేరింది. కానీ టైటిల్ మాత్రం అందుకోలేకపోయింది. 2021లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి, 2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చెందింది. ఇక 2025లో భారత్ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. టైటిల్‌ మాత్రం సౌతాఫ్రికా (South Africa) గెలుచుకున్న విష‌యం తెలిసిందే.

    READ ALSO  Chess World Cup | రెండు ద‌శాబ్దాల‌ త‌ర్వాత తొలిసారి.. ఇండియాలో చెస్ ప్రపంచక‌ప్‌ పోటీలు

    Latest articles

    Maharashtra | మ‌హిళా రిసెప్ష‌నిస్ట్‌పై రోగి బంధువు దాడి.. అలాంటోడిని వ‌ద‌లొద్దు అంటూ జాన్వీ క‌పూర్ ఫైర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maharashtra | మహారాష్ట్ర థానే జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ఓ దారుణ...

    Abhigyan Malviya | ఆర్మూర్ సబ్ కలెక్టర్​గా అభిజ్ఞాన్​ మాల్వియా

    అక్షరటుడే, ఆర్మూర్ : Abhigyan Malviya | ఆర్మూర్ సబ్ కలెక్టర్​గా (Armoor Sub-Collector) అభిజ్ఞాన్​ మాల్వియా నియమితులయ్యారు....

    Bombay Trains Blast Case | బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే.. నిందితుల‌కు నోటీసులు జారీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:Bombay Trains Blast Case | ముంబై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన...

    Double Bedroom Houses | దీపావళిలోపు డబుల్ బెడ్ రూమ్​ ఇళ్లు ఇవ్వాలి

    అక్షరటుడే, ఇందూరు: Double Bedroom Houses |  అర్బన్ నియోజకవర్గంలో దీపావళి (Diwali) లోపు 3,500 ఇళ్లను మంజూరు...

    More like this

    Maharashtra | మ‌హిళా రిసెప్ష‌నిస్ట్‌పై రోగి బంధువు దాడి.. అలాంటోడిని వ‌ద‌లొద్దు అంటూ జాన్వీ క‌పూర్ ఫైర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maharashtra | మహారాష్ట్ర థానే జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ఓ దారుణ...

    Abhigyan Malviya | ఆర్మూర్ సబ్ కలెక్టర్​గా అభిజ్ఞాన్​ మాల్వియా

    అక్షరటుడే, ఆర్మూర్ : Abhigyan Malviya | ఆర్మూర్ సబ్ కలెక్టర్​గా (Armoor Sub-Collector) అభిజ్ఞాన్​ మాల్వియా నియమితులయ్యారు....

    Bombay Trains Blast Case | బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే.. నిందితుల‌కు నోటీసులు జారీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:Bombay Trains Blast Case | ముంబై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన...