ePaper
More
    Homeక్రీడలుTeam India | అరుదైన క‌ల‌యిక‌తో ఫ్యాన్స్ హ్యాపీ.. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఆటగాళ్లతో భారత...

    Team India | అరుదైన క‌ల‌యిక‌తో ఫ్యాన్స్ హ్యాపీ.. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఆటగాళ్లతో భారత క్రికెటర్ల సంద‌డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Team India | ప్రైవేట్‌ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో అరుదైన క‌ల‌యిక జ‌ర‌గ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇరుజట్ల ఆటగాళ్ల కోచ్‌లు, కెప్టెన్లు కలిసి క్రికెట్‌, ఫుట్‌బాల్‌ ఆడారు. టీమిండియా కెప్టెన్‌ గిల్‌ (Team India Captain Gill), మాంచెస్టర్‌ యునైటెడ్‌ జట్టు సారథి బ్రూనో ఫెర్నాండెజ్‌(Captain Bruno Fernandes)తో పాటు ఆటగాళ్లందరూ ఒకరి జెర్సీలు ఒకరు మార్చుకొని ఫొటోలకు పోజులివ్వ‌డంతో ఆ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. భారత క్రికెట్ జట్టు, ప్రీమియర్ లీగ్ దిగ్గజం మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ ఒకే వేదికపై కలుసుకున్నాయి. ఈ ప్రత్యేక వేడుకను వారి ఉమ్మడి స్పాన్సర్ అయిన అడిడాస్ (Adidas) ఉత్సాహభరితంగా నిర్వహించింది.

    Team India | అరుదైన క్ష‌ణం..

    జూలై 23న ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం(Old Trafford Ground)లో జరగనున్న భారత-ఇంగ్లండ్ మధ్య కీలక టెస్ట్ మ్యాచ్‌కు ముందు, ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రికెట్(Cricket), ఫుట్‌బాల్(Football) ప్రపంచాల్లోని అగ్రశ్రేణి ఆటగాళ్లు అరుదైన సమయాన్ని గడిపారు. ఫొటోషూట్లు, సరదా సంభాషణలు, చిన్నపాటి స్నేహపూర్వక ఆటలతో ఈ కార్యక్రమం స్పోర్ట్స్ సెలబ్రేషన్‌లా మారింది. ఈ ఈవెంట్‌లో ప్రధాన హైలైట్ ఏంటంటే.. భారత క్రికెట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరియు మాంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్ (Manchester United Captain) బ్రూనో ఫెర్నాండెజ్ జెర్సీలు మార్చుకుని దిగిన ఫోటోలు. వీటితో పాటు, ఇతర ఆటగాళ్లు కూడా ఒకరి జెర్సీలు మరొకరు ధరించి ఆట స్పూర్తిని చాటారు. ఈ దృశ్యాలు క్షణాల్లోనే సోషల్ మీడియా అంతటా వైరల్ అయ్యాయి.

    READ ALSO  IND vs ENG | నేటి నుంచి భార‌త్- ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌.. గాయాల‌తో ప‌లువురు భార‌త క్రికెట‌ర్స్ దూరం

    మరోవైపు, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కొన్ని బంతులు వేయగా, యునైటెడ్ డిఫెండర్ హ్యారీ మాగ్వైర్‌ బ్యాట్ పట్టుకుని సరదాగా బ్యాటింగ్ చేశాడు. ఇక రిషబ్ పంత్ తన ఫుట్‌బాల్ నైపుణ్యాలతో మెరిశాడు. యునైటెడ్ గోల్‌కీపర్ టామ్ హీటన్‌ను ఎదుర్కొంటూ పెనాల్టీ కిక్స్ వేయడం అభిమానులకెంతో ఆనందాన్ని ఇచ్చింది. అర్షదీప్ సింగ్, ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్ వంటి యువ ఆటగాళ్లు యునైటెడ్ క్యాంప్‌ను సందర్శించి జెర్సీలపై సంతకాలు చేయడం, ఫోటోలకు ఫోజులివ్వడం, యునైటెడ్ కోచింగ్ సిబ్బందితో ముచ్చటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

    Latest articles

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్(Malnadu Restaurant)​...

    Donald Trump | ట్రంప్‌కు అప్పీల్స్ కోర్టు షాక్‌.. జన్మతః పౌరసత్వంపై కీల‌క ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ త‌గిలింది. జన్మతః పౌరసత్వంపై ట్రంప్...

    Credit Cards | ఎస్​బీఐ, ఫోన్​పే క్రెడిట్​ కార్డులు.. ఆన్​లైన్​ కొనుగోళ్లపై భారీగా డిస్కౌంట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Credit Cards | ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రెడిట్​ కార్డుల వినియోగం పెరిగింది. అలాగే ఆన్​లైన్​...

    Local Body Elections | స్థానిక పోరుకు స‌న్న‌ద్ధం.. స‌న్నాహాక స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న పార్టీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక ఎన్నిక ఎన్నిక‌ల‌కు గ‌డువు స‌మీపిస్తోంది. హైకోర్టు ఆదేశాల...

    More like this