ePaper
More
    HomeజాతీయంSupreme Court | OTT, సోషల్‌ మీడియాలో అశ్లీల కంటెంట్‌పై స్పందించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

    Supreme Court | OTT, సోషల్‌ మీడియాలో అశ్లీల కంటెంట్‌పై స్పందించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న అశ్లీల కంటెంట్‌ను కట్టడి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రం సహా పలు ఓటీటీ OTT, సామాజిక మాధ్యమాల్ల social media ప్లాట్‌ఫామ్‌ల platforms కు దేశ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

    జస్టిస్ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్ అగస్టీన్‌ జార్జ్ మసిహ్‌ Justice BR Gavai and Justice Augustine George Masihతో కూడిన ధర్మాసనం నోటీసులిచ్చింది. ఓటీటీ, సామాజిక మాధ్యమాల్లో లైంగిక అసభ్యకరమైన కంటెంట్‌ను నిషేధించేందుకు నేషనల్ కంటెంట్‌ కంట్రోల్‌ అథారిటీని ఏర్పాటు చేసి మార్గదర్శకాలు జారీ చేయాలని ఐదుగురు పిటిషనర్లు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే దీనిపై సరైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు ఇప్పటికే ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్నింటిని అమలు చేస్తామని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా Solicitor General Tushar Mehta వివరణ ఇచ్చారు.

    విచారణ సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి లైంగిక అసభ్యకరమైన కంటెంట్‌ కారణంగా పిల్లలు, యువతతో పాటు పెద్దల ఆలోచనలు కూడా కలుషితం అవుతాయనే అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. ఇది వికృతమైన, అసహజమైన లైంగిక ధోరణులకు దారితీస్తుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

    దేశంలో నేరాల రేటు పెరిగే ప్రమాదం ఉందని ధర్మాసనం హెచ్చరించింది. విచారణ సమయంలో పరిపాలన, కార్యనిర్వాహక వ్యవహారాల పరిధిలోని ఒక ముఖ్యమైన సమస్యను పిటిషనర్‌ లేవనెత్తగా.. దీనిపై జస్టిస్ బీఆర్‌ గవాయ్‌ స్పందించారు. ఇప్పటికే పరిపాలన, కార్యనిర్వాహక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నామని తమపై ఆరోపణలు వస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

    More like this

    Kukatpally murder case | కాళ్లూచేతులు కట్టేసి.. కుక్కర్​తో బాది.. గొంతు కోసి.. కూకట్​పల్లిలో మహిళ దారుణ హత్య

    అక్షరటుడే, హైదరాబాద్: Kukatpally murder case : నమ్మకంగా ఉంటారనుకున్న ఇంట్లో పనివాళ్లే దారుణానికి ఒడిగట్టారు. ఇంటి యజమానురాలిని...

    Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం (Heavy Rain)...

    Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్ నారాయణ​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్​ నారాయణ మృతి చెందారు. ఆంధ్రజ్యోతి డిచ్​పల్లి రిపోర్టర్​గా పని...