ePaper
More
    HomeతెలంగాణHarish Rao | యాసంగి వడ్లకు బోనస్​ ఇవ్వని ప్రభుత్వం : హరీశ్​రావు

    Harish Rao | యాసంగి వడ్లకు బోనస్​ ఇవ్వని ప్రభుత్వం : హరీశ్​రావు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) రైతులను మోసం చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. యాసంగిలో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన సన్న రకం ధాన్యానికి ఇప్పటికీ బోనస్​ డబ్బులు ఇవ్వలేదని విమర్శించారు. అసలు బోనస్​ ఇస్తారో లేదో కూడా చెప్పడం లేదన్నారు. రాష్ట్రంలో 30 శాతం రుణమాఫీ చేసి, 70 శాతం ఎగ్గొట్టారని ఆయన ఆరోపించారు. సిద్దిపేట జిల్లా (Siddipet District) ప్రజ్ఞాపుర్‌లో సోమవారం హరీశ్​రావు మాట్లాడారు.

    Harish Rao | భూముల రేట్లు పడిపోయాయి

    తెలంగాణలో (Telangana) కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక భూముల రేట్లు పడిపోయాయని హరీశ్​రావు(Harish Rao) అన్నారు. బీఆర్​ఎస్ ప్రభుత్వ​ హయాంలో తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే.. ఏపీలో పది ఎకరాల భూమి వచ్చేదన్నారు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక.. ఏపీలో ఎకరా భూమి అమ్మితే తెలంగాణలో రెండెకరాల భూమి వస్తుందని పేర్కొన్నారు. రేవంత్​రెడ్డికి (Revanth Reddy) పాలన చేతకాక ఇలాంటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ (KCR)​ పాలన కోరుకుంటున్నారని చెప్పారు.

    Harish Rao | వాళ్లు మాత్రమే బాగు పడ్డారు

    కాంగ్రెస్​ పాలనలో బోరు మోటార్లు మరమ్మతులు చేసే వారు మాత్రమే బాగు పడ్డారని హరీశ్​రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అని దుకాణాలు మూసివేస్తుంటే.. మోటారు మెకానిక్​ దుకాణాలు మాత్రం తెరుస్తున్నారన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం కరెంట్​ సక్రమంగా ఇవ్వకపోవడంతో రైతుల మోటార్లు కాలిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.

    Harish Rao | స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

    స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలు, నాయకులకు మాజీ మంత్రి సూచించారు. బీఆర్​ఎస్​ మద్దతుదారులను గెలిపించుకోవాలని అన్నారు. కాంగ్రెస్​ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...