ePaper
More
    HomeసినిమాPawan Kalyan | సినిమాను అనాథగా వదిలేశానని అనిపించింది.. ప‌వ‌న్ క‌ల్యాణ్ కామెంట్స్ వైర‌ల్

    Pawan Kalyan | సినిమాను అనాథగా వదిలేశానని అనిపించింది.. ప‌వ‌న్ క‌ల్యాణ్ కామెంట్స్ వైర‌ల్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pawan Kalyan | ప‌వన్ క‌ల్యాణ్ పెద్దగా సినిమా ప్ర‌మోష‌న్స్ చేయ‌రు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజ‌రై సినిమాపై హైప్ పెంచుతారు. ఇక ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉండ‌డంతో సినిమా ప్రమోషన్లకు రావడం లేదు. దీంతో మేకర్స్‌తో పాటు ఫ్యాన్స్‌లో కొంత అసంతృప్తి నెల‌కొంది. సినిమా గురించి ప‌వ‌న్ మాట్లాడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న నేప‌థ్యంలో పవన్ ఛాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకొచ్చారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) రాక సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిందనే చెప్పాలి. పవర్ స్టార్ పవన్ చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హాజరై, ఈ సినిమాపై తనకున్న అనుబంధాన్ని, దర్శక నిర్మాతల పట్ల తన బాధ్యత గురించి చెప్పారు.

    Pawan Kalyan | ప‌వ‌న్ సంద‌డి..

    ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ‘ఏఎం రత్నం (AM Ratnam) గారు నాకు ఎంతో ఇష్టమైన నిర్మాత. చాలాకాలం క్రితమే పాన్ ఇండియా సినిమాలు తీయాలని కలలు కన్న వ్యక్తి. అలాంటి ఓ గొప్ప నిర్మాత ఈరోజు పరిస్థితుల మధ్య నలిగిపోతే చూడలేకపోయా. ఆయనను చూసి నేను ప్రమోషన్స్‌కి రావాలనుకున్నా’ అంటూ భావోద్వేగంతో స్పందించారు. తాను నటించిన సినిమా అనాథలా మిగిలిపోతుందన్న భావన కలగడంతోనే ఈ ప్రెస్‌మీట్‌(Press Meet)కు వచ్చానని పవన్ తెలిపారు. ‘నిధి అగర్వాల్(Heroine Nidhi Agarwal) ఈ సినిమాను తన భుజాలపై మోస్తోంది. ఆమె చేసిన ప్రయత్నం చూస్తే నాకు బాధేసింది. సినిమా బాగుండాలని కోరుకునే మనసున్న వ్యక్తిగా.. నేనెలా వెనక్కి తగ్గగలను..?’ అని చెప్పారు.

    పవన్ కల్యాణ్ ఈ సినిమాలో తన ప్యాషన్‌ని ప్రదర్శిస్తూ, క్లైమాక్స్ ఎపిసోడ్ యాక్షన్ సీన్‌కి తానే కొరియోగ్రఫీ చేశారని చెప్పారు. ‘ఈ సినిమా కోసం ఏదైనా చేయాలన్నది నా ఉద్దేశం. రత్నం గారికి మద్దతుగా నిలవాలన్నదే నా సంకల్పం’ అన్నారు. సినిమా పరిశ్రమ(Film Industry)ను ముందుకు తీసుకెళ్లాలంటే ప్యాషన్ ఉన్న నిర్మాతలు నిలదొక్కుకోవాలని, ‘అలాంటి వారిని వెనకబడకుండా నిలబెట్టేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా’ అంటూ పవన్ స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్​ ప్రెస్‌మీట్‌లో పాల్గొనడంతో హరిహర వీరమల్లు ప్రమోషన్స్‌(Harihara Veeramallu Promotions)కు బలమైన బూస్టప్ వ‌చ్చింది. ఇప్పుడు ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ ప్రెస్‌మీట్ తర్వాత అందరి దృష్టి సాయంత్రం జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్ పైనే ఉంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...