ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Ration cards | రేషన్ కార్డుల జారీ.. నిరంతర ప్రక్రియ: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

    Ration cards | రేషన్ కార్డుల జారీ.. నిరంతర ప్రక్రియ: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: Ration cards | రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది నిరంతరాయంగా కొనసాగుతుందని.. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి (Rural MLA Bhupathi reddy) పేర్కొన్నారు. మండల కేంద్రంలోని గౌడ సంఘంలో సోమవారం లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

    Ration cards |  40లక్షల కొత్త కార్డులిచ్చాం..

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈనెల 14న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) నూతన కార్డుల పంపిణీని ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో 40లక్షలకు పైగా కొత్త రేషన్​ కార్డులను మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో నిరుపేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతిఒక్క హామీని నెరవేరుస్తోందని గుర్తు చేశారు.

    Ration cards | జిల్లాలో 63,500 కార్డులు..

    జిల్లాలో 63,500, రూరల్ నియోజకవర్గంలో (Rural constituency) 16,116కార్డులు, ఇందల్వాయి (Indalwai) మండలంలో 3,030, తిర్మన్​పల్లి (Tirmanpally) గ్రామంలోనే 292 నూతన కార్డులను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి హామీ నెరవేరుస్తూ వెళ్తుందని స్పష్టం చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉచిత కరెంటు, రైతు భరోసా (Raithu Bharosa), రుణమాఫీ (Runa mafhi), ఉచిత సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Housing Scheme) పథకాలు అమలు చేస్తూ ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు.

    Ration cards | దళారుల చేతిలో మోసపోవద్దు..

    కొందరు దళారులు మీసేవ కేంద్రాలు (Meeseva Centers), ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజల నుండి లంచాలు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మీసేవ సెంటర్ల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడితే వారి లైసెన్స్​లను సస్పెండ్​ చేయిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఎన్నో అక్రమాలకు పాల్పడిందని, అవన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయన్నారు.

    Ration cards | కల్వకుంట్ల కుటుంబం జైలుకు పోవాల్సిందే..

    మాజీ సీఎంతో (KCR) సహా కల్వకుంట్ల కుటుంబం త్వరలోనే జైలుకు వెళ్తుందని భూపతిరెడ్డి వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఎస్​వో భరత్, ఏఏంసీ ఛైర్మన్ ముప్పగంగారెడ్డి, ఐడీసీఎంఎస్​ ఛైర్మన్ తారాచంద్, మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, మునిపెల్లి సాయి రెడ్డి, తహశీల్దార్​ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...