ePaper
More
    HomeజాతీయంParliament Sessions | పార్లమెంట్​ ఉభయ సభల్లో గందరగోళం.. లోక్​సభ మళ్లీ వాయిదా

    Parliament Sessions | పార్లమెంట్​ ఉభయ సభల్లో గందరగోళం.. లోక్​సభ మళ్లీ వాయిదా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Parliament Sessions | పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో తొలిరోజే గందరగోళం నెలకొంది. లోక్సభ, రాజ్యసభలో విపక్షాలు నినాదాలు చేస్తున్నాయి. పహల్గామ్​ ఉగ్రదాడి(Pahalgam Terror Attack), ఆపరేషన్​ సిందూర్​(Operation Sindoor)పై చర్చించాలని విపక్షలు డిమాండ్​ చేస్తున్నాయి. లోక్​సభలో స్పీకర్​ పోడియం దగ్గరకు వెళ్లి విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. ప్రధాని మోదీ(Prime Minister Modi) పార్లమెంట్​కు రావాలంటూ నినాదాలు చేశారు. దీంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు లోక్​సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్​ ఓం బిర్లా తెలిపారు.

    విపక్ష ఎంపీలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు (Union Minister Kiren Rijiju) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్పై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh) ప్రకటించారు. ప్రశ్నోత్తరాల తర్వాత ఆపరేషన్ సిందూర్పై చర్చిద్దామని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla) సూచించారు. అయినా.. విపక్ష సభ్యులు నిరసన కొనసాగిస్తుండడంతో సభను వాయిదా వేశారు. విపక్షాల నిరసనతో మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. తిరిగి సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత కూడా గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో మళ్లీ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.

    More like this

    Kamareddy Collector | ప్రజల ప్రాణాలు కాపాడేందుకే స్పీడ్ లేజర్ గన్స్ ఏర్పాటు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | ప్రజల ప్రాణాలను కాపాడేందుకే లేజర్ గన్స్ ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్...

    BJP Nizamabad | బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా స్రవంతి రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: BJP Nizamabad | భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి...

    Nizamabad City | మహిళను దూషించిన కేసులో కానిస్టేబుల్​కు జైలు

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad City | మహిళను దూషించిన కేసులో న్యాయస్థానం ఓ కానిస్టేబుల్​కు జైలుశిక్ష విధించింది....