ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​U Shape Sitting | బడుల్లో యూ ఆకారంలో బెంచీలు.. విద్యార్థులకు మంచిదేనా!

    U Shape Sitting | బడుల్లో యూ ఆకారంలో బెంచీలు.. విద్యార్థులకు మంచిదేనా!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : U Shape Sitting | పాఠశాలలు, కాలేజీల్లో చదువుకునే విద్యార్థుల్లో బ్యాక్​ బెంచర్స్​(Back Benchers) అంటే చదువు రాని అభిప్రాయం ఉంది. వెనకాల కూర్చున్న విద్యార్థులపై టీచర్లు ఫోకస్​ పెట్టలేకపోవడంతో వారు అల్లరి చేస్తారనే విమర్శలు ఉన్నాయి. అంతేగాకుండా ముందున్న వారిపై ఎక్కువ శ్రద్ధ ఉండటంలో వారు మంచి మార్కులు సాధిస్తున్నారనే భావన ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాల(Government Schools)ల్లో బ్యాక్​ బెంచ్​లు లేకుండా చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు.

    U Shape Sitting | సినిమా కథ స్ఫూర్తితో..

    మళయాళంలో ఇటీవల స్థానార్థి శ్రీకుట్టన్ అనే సినిమా(Sthanarthi Srikuttan Movie) విడుదల అయింది. ఆ సినిమాలో బ్యాక్​ బెంచర్స్​ లేకుండా యూ ఆకారంలో విద్యార్థులను కూర్చొబెట్టారు. ఈ విధానంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా యూ ఆకారంలో బెంచీలు(U Shaped Benches) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    ఇప్పటికే తమిళనాడు, కేరళలోని కొన్ని పాఠశాలల్లో ఈ విధానం అమలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో కూడా అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. జనగామ జిల్లా(Jangaon District)లోని పలు పాఠశాలల్లో యూ ఆకారం సీటింగ్​ ఏర్పాటు చేశారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్(Collector Rizwan Basha Sheikh) మాట్లాడుతూ.. అన్ని ప్రాథమిక తరగతి గదులను ఈ విధానంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

    U Shape Sitting | మన దగ్గర సాధ్యమేనా..

    రాష్ట్రంలో చాలా సర్కార్​ బడుల్లో కనీస వసతులు లేవు. తరగతి గదుల కొరతతో విద్యార్థులు(Students) ఇబ్బందులు పడుతున్నారు. ఒకే తరగతి గదిలో రెండు, మూడు క్లాస్​ల విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఘటనలు ఉన్నాయి. వరండాలో కూర్చొని పాఠాలు వింటున్న వారు ఉన్నారు. యూ ఆకారంలో బెంచీలు ఏర్పాటు చేయాలంటే ఎక్కువ స్థలం అవసరం ఉంటుంది. దీంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానం అమలు చేయడం సాధ్యమయ్యే పనికాదు.

    U Shape Sitting | విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం

    సాధారణంగా కొన్ని కొన్ని సార్లు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్లు ఉంటాయి. బ్యాక్​ బెంచర్స్​ లేకుండా చేయడానికి యూ ఆకారంలో బెంచీలు ఏర్పాటు చేయాలని అనుకోవడం కూడా ఇదే తరహాలోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్​ అరెంజ్​మెంట్ ప్రకారం బ్లాక్​ బోర్డు(Blackboard) అందరికి కనిపిస్తోంది. అయితే యూ ఆకారంలో కూర్చొబెడితే మధ్యలో ఉన్న వారికి మినహా మిగతా వారికి బోర్డు స్పష్టంగా కనిపించదు. దీంతో వారు వంగి చూడాల్సి వస్తుంది. ఇలా చేయడంతో విద్యార్థులకు మెడ నొప్పి, వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉంది. అలాగే.. వారి కంటి చూపుపై కూడా ప్రభావం పడుతుంది. తెలంగాణ మాజీ గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ విధానంతో విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వస్తాయని.. తాను వైద్యురాలిగా ఈ విషయం చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఏదో సినిమాలో చూపించారు కాదా అని అమలు చేయడం సరికాదన్నారు.

    U Shape Sitting | ఇలా చేస్తే మేలు..

    యూ ఆకారంలో బెంచీలు ఏర్పాటు చేసే బదులు ఇలా చేస్తే విద్యార్థులపై శ్రద్ధ కనబరచవచ్చని ప్రముఖ విద్యావేత్త అమర్​నాథ్​వాసిరెడ్డి(Educationist Amarnath Vasireddy) తెలిపారు. విద్యార్థులను నిత్యం ఒకే బెంచీలో కూర్చొపెట్టకుండా స్థానాలను మార్చాలన్నారు. అప్పుడు బ్యాక్​ బెంచర్స్​ అనే సమస్యే ఉండొదు. అలాగే పాఠాలు చెబుతున్న సమయంలో ఉపాధ్యాయులు క్లాస్​ రూం అంతా తిరుగుతూ ఉండాలి. అందరిపై ఫోకస్​ పెట్టడానికి ఇది ఉపయోగపడుతోంది.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...