ePaper
More
    HomeతెలంగాణJurala Project | జూరాల ప్రాజెక్ట్ పై ప్ర‌మాదం.. బైక్‌ను ఢీకొట్టిన కారు.. న‌దిలోకి ఎగిరి...

    Jurala Project | జూరాల ప్రాజెక్ట్ పై ప్ర‌మాదం.. బైక్‌ను ఢీకొట్టిన కారు.. న‌దిలోకి ఎగిరి ప‌డిన యువ‌కుడు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Jurala Project | జూరాల ప్రాజెక్ట్ పై ప్ర‌మాదం చోటు చేసుకుంది. వేగంగా వ‌చ్చిన ఓ కారు బైకును ఢీకొట్టింది. ఈ క్ర‌మంలో బైక్‌పై ఉన్న యువ‌కుడు ఎగిరి న‌దిలో ప‌డి కొట్టుకుపోయాడు. అతని కోసం గాలింపు చర్య‌లు చేప‌ట్టారు. ఆదివారం సాయంత్రం జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. జూరాల ప్రాజెక్టు(Jurala Project)పై వెళ్తున్న కారు 53వ గేట్ వ‌ద్ద‌కు వెళ్ల‌గానే, ఎదురుగా వ‌స్తున్న బైక్‌(Bike)ను ఢీకొట్టింది. దీంతో బైక్ మీద ఉన్న యువ‌కుడు ఎగిరి ప్రాజెక్టులోకి ప‌డ‌గా, మ‌రొక‌రికి గాయాల‌య్యాయి. న‌దిలో ప‌డిన యువ‌కుడి కోసం రెస్క్యూ ఆప‌రేష‌న్ (Rescue Operation) ప్రారంభమైంది. జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District) మానవపాడు మండలం బూడిదపాడు గ్రామ (Budidapadu Viilage) వాసి మ‌హేశ్‌గా గుర్తించారు. సెర్చ్ ఆప‌రేష‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ యువ‌కుడి ఆచూకీ ల‌భించ‌లేదు. అత‌ని కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు.

    Jurala Project | క‌నిపించ‌ని భ‌ద్ర‌తా చ‌ర్య‌లు..

    ప్రాజెక్టుపై వాహ‌నాలను అనుమ‌తించ‌డంపై చాలా కాలంగా విమ‌ర్శ‌లు ఉన్నాయి. కీల‌క‌మైన ఈ ప్రాజెక్టు పైనుంచి వాహ‌నాల రాక‌పోక‌లు ఎక్కువ‌గా జ‌రుగుతాయి. కృష్ణా న‌దికి వ‌ర‌ద‌లు వ‌చ్చి, ప్రాజెక్టు గేట్లు ఎత్తిన స‌మ‌యంలో ప‌ర్యాట‌కులు పెద్ద సంఖ్య‌లో ఇక్క‌డ‌కు త‌ర‌లి వ‌స్తారు. వంతెన‌పై ప్ర‌మాద‌క‌ర స్థితిలో సెల్ఫీల కోసం ఎగ‌బ‌డుతుంటారు. ప్రాజెక్టు వ‌ద్ద భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంపై అధికారులు తీవ్ర నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఎప్ప‌టి నుంచో ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్రాజెక్టు ప‌రిస‌రాల్లో నిషేధ ఆజ్ఞ‌లు విధించ‌క పోవ‌డం, ప‌ర్యాట‌కుల భ‌ద్ర‌త‌ను ప‌ట్టించుకోక పోవ‌డంపై అనేక విమ‌ర్శ‌లు ఉన్నాయి.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...