ePaper
More
    HomeజాతీయంPM Modi | భారత ఆయుధాల వైపు.. ప్రపంచ దేశాల చూపు : ప్రధాని మోదీ

    PM Modi | భారత ఆయుధాల వైపు.. ప్రపంచ దేశాల చూపు : ప్రధాని మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi | భారత్​లో తయారైన ఆయుధాలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. పార్లమెంట్​ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.

    ఆపరేషన్​ సిందూర్​(Operation Sindoor)తో మన సైనికుల సత్తా చాటామన్నారు. తక్కువ సమయంలో మన ఆర్మీ లక్ష్యాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్​తో వంద శాతం లక్ష్యాలను ఛేదించామని మోదీ పేర్కొన్నారు. దీంతో మన సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. 22 నిమిషాల్లోని పాక్​, పీవోకేలోని ఉగ్రస్థావరాలను మట్టు బెట్టామని ఆయన వెల్లడించారు.

    PM Modi | మేడిన్​ ఇండియా ఆయుధాలతో..

    ఆపరేషన్​ సిందూర్​ సమయంలో మేడిన్​ ఇండియా(Made In India) ఆయుధాలను వినియోగించినట్లు ప్రధాని తెలిపారు. ఆ ఆయుధాలు వాటి సత్తాను నిరూపించుకున్నాయన్నారు. దీంతో ప్రపంచ దేశాల మన ఆయుధాల గురించి చర్చించుకుంటున్నాయని పేర్కొన్నారు. మన ఆయుధాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి పెరుగుతుందన్నారు. పార్లమెంట్​ సమావేశాల్లో(Parliament Sessions) ఆపరేషన్​ సిందూర్​ విజయాన్ని వేడుక చేసుకోవాలని ఆయన అన్నారు.

    PM Modi | మావోయిస్టులు లేకుండా చేస్తాం

    దేశంలో ఉగ్రవాదులు, మావోయిస్టులు లేకుండా చేస్తామని మోదీ అన్నారు. ఈ క్రమంలో మావోయిస్టు ముక్త్​ భారత్​ దిశగా ముందడుగు వేశామన్నారు. దేశంలో మావోయిజం దాదాపుగా అంతమైందని, అనేక ప్రాంతాలను మావోయిస్టుల చెర నుంచి బయటకు తీసుకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. వందలాది జిల్లాలు నక్సల్ ఫ్రీ జోన్లు(Naxal Free Zones)గా మారాయన్నారు.

    దేశవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. ఈ వర్షాలు వ్యవసాయానికి ఊతమిస్తాయన్నారు. రైతుల జీవితాలు, దేశ ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు. వర్షాకాల పార్లమెంట్​ సమావేశాలు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. యాక్షియం –4 మిషన్లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిని భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను మోదీ అభినందించారు. అంతరిక్షంలో కొత్త చరిత్ర సృష్టించామన్నారు.

    More like this

    Basketball Selections | రేపు బాస్కెట్​బాల్ సబ్ జూనియర్​​ క్రీడాకారుల ఎంపికలు

    అక్షరటుడే, ఇందూరు : Basketball Selections | జిల్లా బాస్కెట్​బాల్​ అసోసియేషన్(District Basketball Association) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సబ్...

    Moneylenders | బడా వడ్డీ వ్యాపారులపై చర్యలేవి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Moneylenders | వడ్డీ వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నిజామాబాద్​ కమిషనరేట్​ పోలీసులు (Nizamabad...

    Nandipet | వెల్మల్​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడు, నందిపేట్ ​: Nandipet | వెల్మల్(Velmal)​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ను మంగళవారం అందజేశారు. నందిపేట మండలం కేదారీశ్వర...