ePaper
More
    Homeలైఫ్​స్టైల్​Tea Benefits | ఛాయ్‌.. భలే లాభాలోయ్‌.. టీ తాగితే గుండెజ‌బ్బులు దూరం

    Tea Benefits | ఛాయ్‌.. భలే లాభాలోయ్‌.. టీ తాగితే గుండెజ‌బ్బులు దూరం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Tea Benefits | ఉద‌యం లేవ‌గానే ఛాయ్ తాగ‌డం మ‌నంద‌రికీ అల‌వాటే. టీ తాగ‌కపోతే ఏదో వెలితిగా ఉంటుందన్న భావ‌న క‌లుగుతుంది. చేసే ప‌ని మీద కూడా స‌రైన ధ్యాస క‌లుగ‌దు. శారీర‌కంగా, మాన‌సికంగా నీర‌సంగా ఉంటుంది. అంత‌లా మ‌న ప్ర‌భావితం చేసే ఛాయ్ వ‌ల్ల మ‌రో ముఖ్య‌మైన ప్ర‌యోజ‌నం కూడా క‌లుగుతుంద‌ని తాజా అధ్య‌య‌నాల్లో తేలింది.

    టీ(Tea) సేవించ‌డం ద్వారా గుండె జ‌బ్బులకు దూరంగా ఉండొచ్చ‌ని శాస్త్రీయ అధ్య‌య‌నంలో వెల్లడైంది. ప్రధానంగా బ్లాక్ టీ(Black Tea) వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని ఎడిత్ కోవాన్ యూనివ‌ర్సిటీ (ఈసీయూ) రీసెర్చ్‌లో తేలింది.

    Tea Benefits | హృద‌యానికి మేలు..

    ఉదయం లేదా సాయంత్రం తాగే వెచ్చని టీ.. ఎంతో ఉపశమనం కలిగించడం కంటే ఇంకా ఎక్కువే మేలు చేస్తుంది. ప్ర‌ధానంగా హృదయాన్ని కాపాడుతుంది. మంచి సువాస‌న‌తో కూడిన వేడి వేడి ఛాయ్ తాగ‌డం వ‌ల్ల గుండెపోటు (Heart Attack), స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక ప్రమాదాన్ని తగ్గించే శక్తిని కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్లాక్ టీలో ఫ్లేవనాయిడ్లు (Flavonoids) గుండెకు రక్షణ క‌ల్పిస్తాయి.

    క్ర‌మం త‌ప్ప‌కుండా బ్లాక్ టీ తాగే వారి స‌గ‌టు వ‌య‌స్సు 80 ఏండ్ల‌కు పైగా ఉంద‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు. 881 మంది మ‌హిళ‌లతో చేసిన రీసెర్చ్‌లో బ్లాక్ టీ వ‌ల్ల క‌లిగే అనేక ప్ర‌యోజ‌నాలు గుర్తించిన‌ట్లు ప‌రిశోధ‌కులు తెలిపారు. బ్లాక్ టీలో ఉండే ఫ్లేవ‌నాయిడ్ల కార‌ణంగా హృద‌యం ప‌నితీరు చాలా బాగుంద‌ని రీసెర్చ్‌లో తేలింది. త‌ర‌చూ ఛాయ్ తాగే వారిలో గుండెపోటు రావ‌డానికి త‌క్కువ ఆస్కార‌మున్న‌ట్లు వెల్ల‌డైంది. గుండె నుంచి ఇత‌ర అవ‌య‌వాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా చేసే ధ‌మ‌నుల ప‌నితీరును ఫ్లేవ‌నాయిడ్స్ మెరుగుప‌రుస్తాయ‌ని తేలింది.

    Tea Benefits | గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది

    జీవితం చివరి దశలో రోజువారీగా తాగే కప్పు టీ.. మెరుగైన ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి సహాయపడుతుంది. అయితే, కొంత మందికి టీ తాగే అల‌వాటుండ‌దు. అలాంటి వారు ఫ్లేవ‌నాయిడ్లు ఎక్కువ‌గా ఆహారాన్ని తీసుకోవాల‌ని ప‌రిశోధ‌కులు సూచిస్తున్నారు. ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉండే బ్లాక్ లేదా గ్రీన్ టీ (Green Tea), బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, ఆరెంజ్‌, రెడ్ వైన్, ఆపిల్స్, ఎండుద్రాక్ష లేదా ద్రాక్ష, డార్క్ చాక్లెట్ వంటివి తీసుకోవ‌డం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పును త‌ప్పించుకోవచ్చ‌ని సూచిస్తున్నారు.

    ఫ్లేవనాయిడ్లు విభిన్నమైన ఫైటోన్యూట్రియెంట్ల సమూహం (మొక్కల ఆధారిత సమ్మేళనాలు), వాటి యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ సమ్మేళనాలు పండ్లు, కూరగాయలు, ఇతర మొక్కల నుంచి పొందిన ఆహారాలలో కనిపిస్తాయి. ఫ్లేవన్-3-ఓల్స్ మరియు ఫ్లేవనాల్స్ వంటి అనేక రకాల ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి, వీటికి AAC తో సంబంధం ఉందని అధ్యయనం సూచించింది.

    More like this

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....