ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(global markets) మిక్స్‌డ్‌గా కనిపిస్తున్నాయి. గత ట్రేడిరగ్‌ సెషన్‌లో యూఎస్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా క్లోజ్‌ అవగా.. యూరోప్‌(Europe) మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. సోమవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    యూరోపియన్‌ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(Trump) కొత్త సుంకాలను విధించాలని యోచిస్తున్నారన్న వార్తలతో వాల్‌స్ట్రీట్‌(Wallstreet) ఫ్లాట్‌గా ముగిసింది. నాస్‌డాక్‌ 0.05 శాతం పెరగ్గా.. ఎస్‌అండ్‌పీ 0.01 శాతం తగ్గింది. సోమవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.11 శాతం లాభంతో కొనసాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 0.22 శాతం, సీఏసీ 0.01 శాతం పెరగ్గా.. డీఏఎక్స్‌ 0.34 శాతం నష్టపోయింది.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ప్రధాన ఆసియా మార్కెట్లు గురువారం ఉదయం ఎక్కువగా స్వల్ప లాభాలతో ఉన్నాయి. ఉదయం 8 గంటల సమయంలో స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.71 శాతం, హంగ్‌సెంగ్‌(Hang Seng) 0.61 శాతం, షాంఘై 0.53 శాతం, కోస్పీ 0.45 శాతం లాభంతో ఉన్నాయి. తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.45 శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.15 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    మెరైన్‌డే సందర్భంగా జపాన్‌ మార్కెట్లకు సెలవు.

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐ(FII)లు నికరంగా రూ. 374 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా, డీఐఐలు వరుసగా పదో రోజు నికరంగా రూ. 2,103 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.94 నుంచి 0.78 కు తగ్గింది. విక్స్‌(VIX) 1.33 శాతం పెరిగి 11.39 వద్ద ఉంది.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.16 శాతం పెరిగి, 69.36 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలహీనపడి 86.15 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.42 వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98.46 వద్ద కొనసాగుతున్నాయి.
    • రష్యా చమురుపై యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షల ప్రభావంతో ముడిచమురు(Crude oil) ధరలు పెరుగుతున్నాయి.
    • చైనా బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేట్లను యథాతథంగా ఉంచింది. చైనా ఒక సంవత్సరం లోన్‌ ప్రైమ్‌ రేట్‌ను 3 శాతం వద్ద, ఐదేళ్ల రేటును 3.5 శాతం వద్ద అలాగే ఉంచింది.
    • మన కంపెనీల Q1 ఫలితాలు, యూఎస్‌ సుంకాలు, అమెరికా, భారత్‌ల మధ్య వాణిజ్య ఒప్పందం వంటి అంశాలు మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయి.

    More like this

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 9,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...