ePaper
More
    HomeజాతీయంOdisha | బాలిక సజీవ దహనానికి యత్నం.. పరిస్థితి విషమించడంతో విమానంలో ఢిల్లీకి తరలింపు

    Odisha | బాలిక సజీవ దహనానికి యత్నం.. పరిస్థితి విషమించడంతో విమానంలో ఢిల్లీకి తరలింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Odisha | ఒడిశాలో ఓ బాలికను ముగ్గురు యువకులు సజీవ దహనం చేయడానికి యత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి భువనేశ్వర్​ ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు ఆమెను విమానంలో ఢిల్లీ ఎయిమ్స్​కు తరలించారు.

    ఒడిశాలో పూరి జిల్లా బలంగా పోలీస్ స్టేషన్​ పరిధిలోని నువాగోపాల్​పూర్​ గ్రామ శివారులో 15 ఏళ్ల బాలికపై శనివారం ముగ్గురు దుండుగులు కిరోసిన్​ పోసి నిప్పంటించారు. దీంతో ఆమె కేకలు వేయడంతో స్థానికులు మంటలు ఆర్పి పోలీసుల సాయంతో భువనేశ్వర్​లోని ఎయిమ్స్​కు తరలించారు. ఈ ఘటనలో బాలిక శరీరం 75 శాతం కాలిపోయింది. దీంతో భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బర్న్ సెంటర్‌లో ఐసీయూ ఆమెకు చికిత్స అందించారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో ఆదివారం విమానంలో ఢిల్లీ ఎయిమ్స్​కు తరలించారు.

    ప్రస్తుతం ఆమెను బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ బ్లాక్‌లోని బర్న్ ఐసీయూ చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆక్సిజన్ సపోర్టుపై వైద్యం అందిస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

    More like this

    YS Jagan | చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డ జగన్​.. ప్రభుత్వం ఉందా అని ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandra Babu)...

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...