ePaper
More
    HomeజాతీయంHaryana | సరదా జోక్‌ నిజమైంది.. భర్త కళ్ల ముందే భార్య మృతి

    Haryana | సరదా జోక్‌ నిజమైంది.. భర్త కళ్ల ముందే భార్య మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Haryana | హర్యానాలోని గురుగ్రామ్‌ జిల్లాలో (Gurugram district) ఓ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరదాగా మొదలైన ఒక జోక్‌ ఓ యువతి ప్రాణాన్ని తీసింది. భర్త కళ్ల ముందే ఆమె ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఒడిశా (Odisha) రాష్ట్రం గంజామ్ జిల్లాకు చెందిన పార్వతి మరియు ధుర్యోదన రావ్ దంపతులు రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ జంట గురుగ్రామ్‌ డీఎల్ఎఫ్ ఫేజ్–3 ప్రాంతంలో (Gurugram DLF Phase-3 area) నివాసం ఉంటోంది. ప్రేమగా, అన్యోన్యంగా జీవితం సాగిస్తున్న వారి జీవితంలో తీవ్ర విషాదం నెల‌కొంది.

    Haryana | ఊహించ‌ని ప్ర‌మాదం..

    సాయంత్రం, పార్వతి (Parvathi) ఇంటి టెర్రస్‌కు వెళ్లి గోడ మీద రెండు కాళ్లు ఒకే వైపు పెట్టి కూర్చుంది. ఆమె భర్త దగ్గర్లోనే నిలుచోగా, ఇద్దరూ నవ్వుతూ సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో పార్వతి తన భర్తను చూసి, నేను ఇక్కడినుంచి కింద పడిపోతే పట్టుకుంటావా? అని సరదాగా అడిగింది. ప‌ట్టుకుంటా అన్నాడు. కానీ ఆమె అన్న ఆ మాటలే చివరి మాటలయ్యాయి. మెల్లగా వెనక్కి వాలడంతో కిందకి జారింది. వెంట‌నే ఆమె భ‌ర్త‌ చేతులు పట్టుకొని దాదాపు రెండు నిమిషాల పాటు అలానే ఉన్నాడు. కానీ సహాయం చేయడానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో.. చివరికి ఆమె అత‌ని చేతిలో నుండి జారిపోయింది. పార్వతి నాల్గో అంతస్తు నుంచి కింద పడిపోవ‌డంతో భర్త ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

    తీవ్ర గాయాలు కావడంతో.. చికిత్స పొందుతూ పార్వతి మృతి చెందింది. సంఘటనపై సమాచారం అందుకున్న గురుగ్రామ్‌ పోలీసులు (Gurugram Police) ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. యాక్సిడెంట్‌నా? ఆత్మహత్యా? లేక హత్యా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాదకర సంఘటన ఇప్పుడు ఆ ప్రాంతంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల చాలా మంది దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు.

    More like this

    Asia Cup | బోణీ కొట్టిన ఆఫ్ఘ‌నిస్తాన్.. ఆదుకున్న అటల్ , అజ్మతుల్లా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | గ‌త రాత్రి ఆసియా కప్‌–2025 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో...

    Indian Railway Jobs | పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Railway Jobs | భారతీయ రైల్వేలో (Indian Railway) ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి...

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...