ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | అన్నదాత భూమి కబ్జా.. ఆందోళనతో ఆత్మహత్య

    Kamareddy | అన్నదాత భూమి కబ్జా.. ఆందోళనతో ఆత్మహత్య

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కబ్జాకు గురైన తన భూమి తిరిగి దక్కుతుందో లేదోనని బెంగతో కామారెడ్డి జిల్లాలో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన 26 గుంటల భూమి ఓ ముగ్గురు వ్యక్తుల కబ్జాలో ఉందని.. తన ఆత్మహత్యకు వారే కారణమని పేర్లు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి మండలం శాబ్దిపూర్ గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

    కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డికి 26 గుంటల భూమి ఉంది. అయితే ఆ భూమిని గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారు. ఈ విషయంలో న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అధికారుల చుట్టూ తిరగ్గా సర్వే అధికారులు వచ్చి ఆ భూమి ముగ్గురి వ్యక్తుల కబ్జాలో ఉందని తేల్చారు. అయితే ఆ భూమి కోర్టు పరిధిలో ఉన్నట్టు సమాచారం. భూమి కబ్జా కావడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఆ రైతును వేధించసాగాయి. దీంతో తన భూమి దక్కుతుందో లేదోనన్న భయంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే చనిపోయే ముందు తన చావు కారణమైన వారి పేర్లను సూసైడ్ నోట్​లో రాసి తన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని పేర్కొన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Karisma Kapoor | సంజయ్ కపూర్ ఆస్తి వివాదం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కరిష్మా కపూర్ పిల్లలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karisma Kapoor | బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ మంగళవారం ఢిల్లీ...

    CMC Vellore | వెల్లూరు సీఎంసీని సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    అక్షరటుడే, బాన్సువాడ : CMC Vellore | తమిళనాడులోని ప్రసిద్ధ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (Christian Medical College)...

    Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట

    అక్షరటుడే, బాన్సువాడ: Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట వేశారని బాన్సువాడ ఎస్​ఆర్​ఎన్​కే ప్రభుత్వ డిగ్రీ...