ePaper
More
    HomeతెలంగాణRaja Singh | నేను ఏ పార్టీలోకి వెళ్లను.. ఎమ్మెల్యే రాజాసింగ్​ కీలక వ్యాఖ్యలు

    Raja Singh | నేను ఏ పార్టీలోకి వెళ్లను.. ఎమ్మెల్యే రాజాసింగ్​ కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Raja Singh | గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ (MLA Rajs Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన బోనాల సందర్భంగా లాల్ దర్వాజా మహంకాళి (Lal Darwaja Mahankali) అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి తనను ఆపి గోరక్షణ కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారన్నారు. అలాగే గోశాలల నిర్మాణం కోసం తన సాయం కోరారని ఆయన పేర్కొన్నారు.

    అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని ​ స్పష్టం చేశారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి (State President) ఎన్నిక సమయంలో రాజాసింగ్​ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ఆయన రాజీనామాను ఆమోదించారు. దీంతో రాజాసింగ్​ ఇతర పార్టీల్లో చేరుతారనే ప్రచారం జరిగింది. తాజాగా ఆయన దీనిపై స్పందించారు.

    Raja Singh | రాజీనామా చేయమంటే చేస్తా

    తాను ఏ పార్టీలోకి వెళ్లనని, బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవికీ తనను బీజేపీ రాజీనామా చేయ్యమంటే చేస్తానని తెలిపారు. గోషామహల్​లో ఉప ఎన్నిక వస్తే తాను మళ్లీ పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. హిందూ వాహిని కార్యకర్తగా తాను మోదీ, అమిత్​ షా, యోగి ఆదిత్యానాథ్​ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తాన్నారు. ఎంఐఎంతో దోస్తీ ఉన్న కాంగ్రెస్​ లో తాను చేరనని స్పష్టం చేశారు.

    More like this

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...