ePaper
More
    Homeభక్తిShravana Masam | శ్రావణం.. పరమ పవిత్రం

    Shravana Masam | శ్రావణం.. పరమ పవిత్రం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Shravana Masam | తెలుగు నెలల్లో ఐదవదైన(Fifth month) శ్రావణం.. పరమ పవిత్ర మాసంగా పరిగణింపబడుతోంది. పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణమాసం (Shravana Masam) అన్న పేరు వచ్చింది. ఇది ఆధ్యాత్మిక మాసం. ఈనెల రోజులు ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. భగవన్నామ స్మరణతో ఆలయాలు మార్మోగుతాయి. ఈ ఏడాది శ్రావణమాసం 25వ తేదీన ప్రారంభమవుతుంది. శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన ఈ మాసం విశిష్టతలు తెలుసుకుందామా..

    Shravana Masam | శ్రావణ మాసం ప్రాముఖ్యత..

    అమృతం కోసం దేవతలు, రాక్షసులు సముద్ర మంథనం చేసినప్పుడు.. మొదట హాలాహలం వచ్చింది. సమస్త విశ్వాన్ని నాశనం చేసే శక్తి కలిగిన ఈ విషాన్ని శివుడు(Lord Shiva) స్వీకరించి, గరళంలో నిలిపి గరళకంఠుడిగా మారారు. ఈ విషం వల్ల ఆయన గొంతు నీలం రంగులోకి మారడంతో ఆయన నీలకంఠుడయ్యాడు. ఇది శ్రావణ మాసంలో జరిగిందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ మాసాన్ని శివుడికి అంకితం చేశారు.

    శివ, కేశవ(Keshava) భేదం లేకుండా పూజించడానికి విశేషమైన మాసంగా శ్రావణాన్ని భావిస్తారు. ఈనెలలో చేసే ఏ దైవ కార్యమైనా అనేక రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని భక్తులు నమ్ముతారు. సోమవారాల్లో శివారాధన, అభిషేకాదులు నిర్వహిస్తారు. శనివారం శ్రీమహావిష్ణువు (Sri Maha Vishnu)ను పూజిస్తారు. పార్వతి మాతకు సైతం ఇష్టమైన మాసం శ్రావణం. అమ్మవారికి నిత్య పూజలు నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతాలు (Mangala Gauri Vratam) ఆచరిస్తారు.

    శ్రావణమాసం శ్రీమహావిష్ణువుతోపాటు ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి (Shri Maha Laxmi) అత్యంత ప్రీతికరమైనది. ఈ నెలలో వివిధరకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా (Varalakshmi Vratam) జరుపుకుంటారు. ఒకవేళ ఆ రోజు వీలుకానివారు శ్రావణంలో వచ్చే మరో శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

    శ్రావణ పౌర్ణమి రోజును రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటారు. సోదర, సోదరీమణుల మధ్య ఆత్మీయ బంధానికి ప్రతీక. ఆరోజు సోదరీమణులు సోదరులకు రక్షలు కట్టి ఆశీర్వదిస్తారు. శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేస్తారు.

    శక్ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్ల పక్ష ఏకాదశి (Ekadashi) నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. కృష్ణపాడ్యమి, కృష్ణాష్టమి (Shri Krishna Janmashtami), హయగ్రీవ జయంతి, నాగపంచమి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య తిథులూ ఈ నెలలోనే వస్తాయి. ఆధ్యాత్మిక మాసమయిన శ్రావణం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...