ePaper
More
    Homeక్రైంVisakhapatnam | డిపాజిట్ల పేరిట రూ.వంద కోట్ల మోసం.. పరారీలో రిటైర్డ్​ ఐఆర్​ఎస్​ అధికారి

    Visakhapatnam | డిపాజిట్ల పేరిట రూ.వంద కోట్ల మోసం.. పరారీలో రిటైర్డ్​ ఐఆర్​ఎస్​ అధికారి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Visakhapatnam | డిపాజిట్ల పేరిట రూ.100 కోట్లు సేకరించిన ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం (Visakhapatnam)లో మ్యాక్స్ సంస్థ (Max company) 12శాతం వడ్డీ ఇస్తామని నమ్మించి ఉద్యోగులు, రిటైర్డ్​ ఉద్యోగుల నుంచి విరాళాలు సేకరించింది. అనంతరం బోర్డు తిప్పేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు మ్యాక్స్ సంస్థ డైరెక్టర్లు, ఉద్యోగులను అరెస్ట్​ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, రిటైర్డ్​ ఐఆర్​ఎస్ (Retired IRS)​ అధికారి శివభాగ్యారావు పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    Visakhapatnam | అంబేడ్కర్ పేరిట..

    విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి శివభాగ్యారావు అంబేడ్కర్ ఆశయ సాధన పేరుతో 2008లో మ్యాక్స్ కోఆపరేటివ్ సొసైటీ స్థాపించారు. 12 శాతం వడ్డీ ఇస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగులను, పెన్షనర్లను నమ్మించారు. దీంతో ఆయన మాటలను నమ్మిన దాదాపు 2500 మంది రూ.వంద కోట్ల వరకు డిపాజిట్​ చేశారు. మొదట వడ్డీ సక్రమంగా చెల్లించిన సంస్థ.. తర్వాత కార్యకలాపాలను తగ్గించడం మొదలు పెట్టింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ డైరెక్టర్లు, ఉద్యోగులను పోలీసులు తాజాగా అరెస్ట్​ చేయగా.. కోర్టు 14 రోజుల రిమాండ్‌కు విధించింది.

    Visakhapatnam | పరారీలో ప్రధాన నిందితుడు

    ఈ కేసులో విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి శివభాగ్యారావు పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంస్థ ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు, డైరెక్టర్లు ఉండవల్లి శ్రీనివాసరావు, గూడూరు సీతామహాలక్ష్మి, ఎల్ విశ్వేశ్వరరావు, ఎకౌంటెంట్ ధనలక్ష్మి, మేనేజర్ రంగారావును పోలీసులు అరెస్ట్​ చేశారు. ఛైర్మన్​ శివభాగ్యారావుతో పాటు మరో 12 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    More like this

    Banswada | సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | పట్టణంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని బీఆర్​ఎస్​ నాయకులు డిమాండ్​...

    Yellareddy | ప్రేమించిన యువకుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ప్రేమికుడు మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు (Yellareddy Police)...

    BC bills | బీసీ బిల్లును అడ్డుకుంటూ బీజేపీ రాజకీయం చేస్తోంది..: మంత్రి సీతక్క

    అక్షరటుడే, కామారెడ్డి: BC bills | రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లును అడ్డుకుంటూ బీజేపీ రాజకీయం చేస్తోందని...