ePaper
More
    HomeతెలంగాణRailway Minister | కేంద్రం గుడ్​న్యూస్​.. కాజీపేట నుంచి బల్లార్ష మార్గంలో నాలుగో లైన్​

    Railway Minister | కేంద్రం గుడ్​న్యూస్​.. కాజీపేట నుంచి బల్లార్ష మార్గంలో నాలుగో లైన్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Minister | రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​ తెలంగాణకు గుడ్​ న్యూస్​ చెప్పారు. కాజీపేట నుంచి బల్లార్ష మార్గంలో (Kazipet to Ballarsha route) త్వరలో నాలుగో మార్గం (క్వాడ్రాప్లింగ్) పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. శనివారం కేంద్ర మంత్రి కాజీపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలో నాలుగో మార్గం పనులు చేపడుతామని పేర్కొన్నారు. కాజీపేటలో రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. ఈ యూనిట్​తో చాలా మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

    Railway Minister Ashwini Vaishnav | తుదిదశకు మూడో లైన్​ పనులు

    కాజీపేట నుంచి బల్లార్ష వరకు నిత్యం రద్దీ అధికంగా ఉంటుంది. ఈ మార్గంలో వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఇప్పటికే రెండు ట్రాక్​లు ఉండగా.. మూడో ట్రాక్​ పనులు కేంద్ర ప్రభుత్వం (Central Government) చేపట్టింది. ఆ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో మూడో మార్గం కూడా అందుబాటులోకి రానుంది. అయితే రైళ్ల రద్దీ నేపథ్యంలో మరో ట్రాక్​ కూడా ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కాగా కాజీపేట – బల్లార్ష మార్గం ఉత్తర-దక్షిణ భారతదేశాలను అనుసంధానించే ముఖ్యమైన మార్గం.

    Railway Minister Ashwini Vaishnav | 2026 నాటికి పూర్తి

    కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ (railway coach factory) పనులు 2026 నాటికి పూర్తి చేసి, రైల్వే కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక్కడ త్వరలోనే 150 లోకోమోటివ్‌లు ఎగుమతి అవుతాయన్నారు. మెట్రో, వందే భారత్​ కోచ్​లను (Metro and Vande Bharat coaches) కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తామని ఆయన తెలిపారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...