అక్షరటుడే, కోటగిరి: Sand tippers | ఉమ్మడి కోటగిరి మండలాల్లో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ మేరకు తహశీల్దార్ గంగాధర్ (Tahsildar Gangadhar) వివరాలు వెల్లడించారు. రాత్రి సమయంలో ఎలాంటి అనుమతుల్లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు టిప్పర్లను కోటగిరి మండలం వల్లభాపూర్ గ్రామ శివారులో పోలీసులు పట్టుకున్నారు.
అలాగే పోతంగల్ (Pothangal) మండలం సోంపూర్(Sompur) గ్రామ శివారులో అక్రమంగా డంప్ చేసి (Sand Dumps) నిల్వ ఉంచిన 15 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనపరుచుకొని పోలీసులకు అప్పజెప్పినట్లు తహశీల్దార్ వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో ఆర్ఐ సయ్యద్ హుస్సేన్, ఏఎస్సై బన్సీలాల్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Sand tippers | ఆగని ఇసుక అక్రమ రవాణా..
పోలీసుల కట్టుదిట్టమైన నిఘా ఉన్నప్పటికీ.. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ ఉన్నా.. ఇసుక అక్రమ రవాణా ఏమాత్రం ఆగట్లదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదయం అధికారులు, పోలీసులతో ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో ఎక్కువగా రాత్రివేళల్లోనే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు.