అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ktr జిమ్లో వర్క్ అవుట్ చేస్తూ సోమవారం గాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నడుముకు చిన్న గాయమైందంటూ ఆయన ట్వీట్ చేశారు. వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలిపారు. త్వరలో కోలుకుని ప్రజల ముందుకు వస్తానని కేటీఆర్ పేర్కొన్నారు.