ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Liquor Scam | లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్

    Liquor Scam | లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Liquor Scam | ఏపీ మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణ నిమిత్తం హాజరైన ఎంపీ మిథున్​రెడ్డి (MP Mithun Reddy) సిట్​ అధికారులు అరెస్ట్​ చేశారు. ఈ కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్​ రెడ్డి శనివారం విచారణ నిమిత్తం సిట్​ కార్యాలయానికి వచ్చారు. గతంలో ఒకసారి ఆయనను అధికారులు విచారించారు. తాజాగా ఆరు గంటల విచారణ తర్వాత మిథున్​రెడ్డిని అరెస్ట్​ చేశారు.

    లిక్కర్ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో మిథున్​రెడ్డి కీలకంగా ఉన్నట్లు సిట్ (SIT)​ గుర్తించింది. ఆయనకు చెందిన సంస్థలకు లిక్కర్‌ ముడుపులు వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆయనను అరెస్ట్​ చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరిగింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్​ కోసం ఏపీ హైకోర్టు (AP High Court)ను ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆయన పిటిషన్​ను కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించగా.. అక్కడ కూడా చుక్కెదురు అయింది. దీంతో మిథున్‌రెడ్డి విజయవాడలో సిట్‌ ఎదుట విచారణకు హాజరు కాగా.. అధికారులు అరెస్ట్​ చేశారు. ఆయనను రేపు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే అవకాశం ఉంది.

    More like this

    AP High Court | హైకోర్ట్‌కి పవన్ కళ్యాణ్ సినిమాలు, టికెట్ల వ్య‌వ‌హారం.. సీఎం, మంత్రులు సినిమాల్లో నటించొచ్చా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP High Court | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలు, టికెట్...

    Deputy CM Pawan Kalyan | ఆ ఒక్క రాత్రి ఏపీ రాజ‌కీయాల‌ని మార్చేసింది.. ఆ రోజు పెను తుఫానే వ‌చ్చింది..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Deputy CM Pawan Kalyan | ప్రతి రాజకీయ నాయకుడి జీవితంలో ఒక సంఘటన...

    Big Boss 9 | తండా నుండి బిగ్ బాస్ హౌజ్‌లోకి.. ఇన్‌స్పైర్ అయిన నాగార్జున‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Big Boss 9 | బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9...