ePaper
More
    HomeతెలంగాణDengue | డెంగీ విజృంభణ.. ఒకే గ్రామంలో మంచం పట్టిన పదుల సంఖ్యలో ప్రజలు

    Dengue | డెంగీ విజృంభణ.. ఒకే గ్రామంలో మంచం పట్టిన పదుల సంఖ్యలో ప్రజలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Dengue | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. విషజ్వరాలతో అనేక మంది మంచం పడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు (Private hospitals) పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. కాగా.. ఇటీవల కామారెడ్డి జిల్లా (Kamareddy district) పాల్వంచ మండలం భవానిపేట పరిధిలోని కిసాన్​ నగర్​లో 20 మందికి డెంగీ పాజిటివ్​ వచ్చిన విషయం తెలిసిందే.

    నిజాంసాగర్​ మండలం వడ్డేపల్లిలో 14 ఏళ్ల బాలుడికి డెంగీ సోకింది. కాగా.. తాజాగా నిజామాబాద్​ జిల్లా (Nizamabad district) మోపాల్​ మండలం కాల్పోల్​ తండాలో డెంగీ (Dengue) విజృంభిస్తోంది. పదుల సంఖ్యలో ప్రజలు డెంగీ లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో వైద్య సిబ్బంది శనివారం గ్రామంలో శిబిరం ఏర్పాటు చేశారు. జ్వరాలతో బాధ పడుతున్న 30 మంది శాంపిల్స్​ తీసుకున్నారు. నలుగురు అనుమానిత శాంపిళ్లను ల్యాబ్​కు పంపించారు. కాగా.. డెంగీ లక్షణాలతో నిజామాబాద్​లోని ప్రైవేట్​ ఆస్పత్రుల్లో గ్రామానికి చెందిన 30 వరకు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వైద్య శిబిరంలో డిస్ట్రిక్ట్​ మలేరియా ఆఫీసర్​ రాథోడ్​, డాక్టర్​ ప్రత్యూష, డాక్టర్​ అజ్మత్​, గ్రామస్తులు ప్రతాప్​ సింగ్​ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...