ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | పోలీస్​ సిబ్బందికి మార్గదర్శకాలు ఇవ్వాలి

    CP Sai Chaitanya | పోలీస్​ సిబ్బందికి మార్గదర్శకాలు ఇవ్వాలి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CP Sai Chaitanya | కోర్టు డ్యూటీ ఆఫీసర్లు పోలీసు సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని సీపీ కార్యాలయంలో (CP Office) శనివారం కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు (Court Duty Officers) ఈ-సమన్స్​పై శిక్షణ కార్యక్రమాన్ని సీపీ ప్రారంభించారు.

    CP Sai Chaitanya | సమయానుకూలంగా ఈ-సమన్స్​ జారీ చేయాలి

    ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతి కేసులో సంబంధిత వ్యక్తులకు సమయానుగుణంగా ఈ‌–సమన్స్​ జారీ చేయాలని సూచించారు. పారదర్శకత, వేగవంతమైన సేవల కోసం టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. సంబంధిత డిజిటల్ ప్లాట్‌ఫామ్​లను (Digital platform) వాడడంలో శిక్షణ తీసుకుని, ప్రతి ఆదేశాన్ని రికార్డు​ చేయాలని సూచించారు. సంబంధిత అన్ని కోర్టుల నుండి జారీ అయ్యే సమన్స్​ను పోలీస్​స్టేషన్ల వారీగా డౌన్​లోడ్​ చేసుకుని త్వరితగతిన వాటిని సంబంధీకులకు అందజేయాలని సూచించారు.

    CP Sai Chaitanya | ఎస్​హెచ్​వోలకు వివరించాలి

    ఈ శిక్షణను సిబ్బంది సద్వినియోగపర్చుకున్న అనంతరం వారు సంబంధిత పోలీస్​స్టేషన్​ ఎస్​హెచ్​వోలకు శిక్షణ గురించి క్లుప్తంగా వివరించాలన్నారు. ఈ శిక్షణలో డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి (DCP Baswareddy), సీసీఆర్​బీ ఇన్​స్పెక్టర్​ సతీష్ (CCRB Inspector Satish), కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్యాం కుమార్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని కోర్ డ్యూటీ ఆఫీసర్లు,​ సిబ్బంది పాల్గొన్నారు.

    More like this

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...

    Chili’s Bar | చిల్లీస్ బార్​ను సీజ్ చేయాలని డిమాండ్​..

    అక్షరటుడే, కామారెడ్డి: Chili's Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్...