ePaper
More
    HomeతెలంగాణMynampally Hanumantha Rao | కేటీఆర్ వల్ల ఎన్నో కుటుంబాలు ఆగమయ్యాయి.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

    Mynampally Hanumantha Rao | కేటీఆర్ వల్ల ఎన్నో కుటుంబాలు ఆగమయ్యాయి.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Mynampally Hanumantha Rao | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ వల్ల ఎన్నో కుటుంబాలు ఆగమయ్యాయని కాంగ్రెస్​ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు (Mynampally Hanumantha Rao) అన్నారు. మైనంపల్లి శనివారం మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యభర్తల మాటలు విన్నారని ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల జీవితాలు నాశనం చేశారన్నారు.

    Mynampally Hanumantha Rao | సీఎం ఎందుకు వదిలేస్తున్నారో..

    కేటీఆర్​, హరీశ్​రావులను సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఎందుకు వదిలేస్తున్నారో అర్థం కావడం లేదని మైనంపల్లి వ్యాఖ్యానించారు. కాగా.. ఇటీవల చెక్కుల పంపిణీ సమయంలో మల్కాజ్​గిరి ఎమ్మెల్యే రాజశేఖర్​రావు (Malkajgiri MLA Rajasekhar Rao), మైనంపల్లి వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బీఆర్​ఎస్​ నాయకులు సవాల్​ విసరడంతో మెదక్​ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అల్వాల్​ చౌరస్తాలో ర్యాలీ కూడా నిర్వహించారు. అయితే చెక్కుల పంపిణీ సందర్భంగా జరిగిన గొడవలో గాయపడ్డ బీఆర్​ఎస్​ కార్యకర్తలను శుక్రవారం కేటీఆర్(KTR)​ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు సైతం వార్నింగ్​ ఇచ్చిన విషయం తెలిసిందే.

    READ ALSO  National Vaddera Association | జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడిగా పిట్ల శ్రీధర్

    Mynampally Hanumantha Rao | జీవితంలో సీఎం కాలేవు

    కేటీఆర్​ వ్యాఖ్యలపై మైనంపల్లి మండిపడ్డారు. ఆయన జీవితంలో సీఎం కాలేడన్నారు. కేటీఆర్​ ప్రభుత్వ భూములు అమ్ముకున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య లొల్లి పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఏపీలో బీఆర్​ఎస్​ పార్టీని (BRS Party) ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. తమ కార్యకర్తల జోలికి వస్తే కేటీఆర్​, హరీశ్​రావు(Harish Rao)పై దాడి చేస్తామన్నారు.

    Mynampally Hanumantha Rao | కేటీఆర్​ అరాచకాలపై బుక్​ రాస్తా..

    గతంలో కేటీఆర్‌ షాడో సీఎంగా వ్యవహరించారని మైనంపల్లి అన్నారు. సిరిసిల్ల ప్రజలు ఆయనకు బుద్ధిచెప్పే రోజులు వస్తాయన్నారు. కేటీఆర్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ అరాచకాలపై పుస్తకం రాసి గడపగడపకూ పంచుతానని పేర్కొన్నారు.

    కాగా.. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు మైనంపల్లి హనుమంత రావు బీఆర్​ఎస్​లో కొనసాగారు. అయితే ఎన్నికల సమయంలో తనకు, తన కుమారుడికి టికెట్​ ఇవ్వడానికి బీఆర్​ఎస్​ నిరాకరించడంతో కాంగ్రెస్​లో చేరారు. మల్కాజ్​గిరి నుంచి మైనంపల్లి, మెదక్​ నుంచి ఆయన కుమారుడు రోహిత్​ పోటీ చేశారు. అయితే మైనంపల్లి హనుమంతరావు ఓడిపోగా, ఆయన కుమారుడు గెలిచారు.

    READ ALSO  Ration Cards | 25 నుంచి మండలకేంద్రాల్లో రేషన్‌కార్డుల పంపిణీ

    Latest articles

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్(Malnadu Restaurant)​...

    Donald Trump | ట్రంప్‌కు అప్పీల్స్ కోర్టు షాక్‌.. జన్మతః పౌరసత్వంపై కీల‌క ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ త‌గిలింది. జన్మతః పౌరసత్వంపై ట్రంప్...

    Credit Cards | ఎస్​బీఐ, ఫోన్​పే క్రెడిట్​ కార్డులు.. ఆన్​లైన్​ కొనుగోళ్లపై భారీగా డిస్కౌంట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Credit Cards | ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రెడిట్​ కార్డుల వినియోగం పెరిగింది. అలాగే ఆన్​లైన్​...

    Local Body Elections | స్థానిక పోరుకు స‌న్న‌ద్ధం.. స‌న్నాహాక స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న పార్టీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక ఎన్నిక ఎన్నిక‌ల‌కు గ‌డువు స‌మీపిస్తోంది. హైకోర్టు ఆదేశాల...

    More like this