అక్షరటుడే, నిజాంసాగర్: Mla Laxmi Kantha Rao | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. పెద్ద గొడప్గల్ మండలం జగన్నాథపల్లి గ్రామంలో శనివారం వనోమహోత్సవం–2025లో (Vanamahotsavam) భాగంగా మొక్కలు నాటారు.
Mla Laxmi Kantha Rao | మొక్కలతోనే భవిష్యత్తు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లు పెంచితేనే భవిష్యత్తులో మానవుల మనుగడ సాధ్యమవుతుందన్నారు. ప్రతిఒక్కరూ ఒకమొక్కను నాటడాన్ని లక్ష్యంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములను చేసి మొక్కలు నాటించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు (Forest Department), కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.