ePaper
More
    HomeతెలంగాణHeavy rain | వరదలో చిక్కుకున్న ఉద్యోగులు.. బోట్ల సాయంతో బయటకు..

    Heavy rain | వరదలో చిక్కుకున్న ఉద్యోగులు.. బోట్ల సాయంతో బయటకు..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain | తెలంగాణ రాజధాని హైదరాబాద్​ (Telangana capital Hyderabad) లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో జంట నగరాలు తడిసి ముద్దయ్యాయి. సికింద్రాబాద్​లోని ‘పైగా’ కాలనీలోని ఇళ్లు నీట మునిగాయి. స్థానిక ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. షోరూమ్స్, పరిశ్రమల ఉద్యోగులు వరదలో చిక్కుకుపోయారు. దీంతో వారిని బయటకు తీసుకొచ్చేందుకు విపత్తు నిర్వహణ సిబ్బంది బోట్ల సాయంతో బయటకు తీసుకురావాల్సి వచ్చింది.

    Heavy rain | జల దిగ్బంధంలో ప్యాట్నీ..

    బేగంపేట Begumpet, ప్యాట్నీ Patni నాలా పరీవాహక ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధం అయ్యాయి. దీంతో స్థానికులు, ఆయా సంస్థలు, షోరూంల ఉద్యోగులు వరదలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న హైడ్రా చీఫ్ రంగనాథ్ Hydra Chief Ranganath బోటులో ఘటనా స్థలికి చేరుకున్నారు. NDRF సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వరదలో చిక్కుకున్న వారిని బోట్ల సాయంతో బయటకు తీసుకొచ్చారు.

    Heavy rain | ఎక్కడికక్కడ ట్రాఫిక్​ జామ్​..

    భారీ వర్షంతో హైదరాబాద్​లో ఎక్కడికక్కడ ట్రాఫిక్​ జామ్​ అయింది. బేగంపేట – సికింద్రాబాద్ మార్గం పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. ఫతేనగర్​ Fatehnagar ఫ్లైఓవర్​ ట్రాఫిక్​తో నిండిపోయింది. గండిమైసమ్మ Gandimaisamma జంక్షన్​లోనూ రోడ్లపై భారీగా వరద నీరు నిలవడంతో ట్రాఫిక్​ తిప్పలు తప్పలేదు.

    సికింద్రాబాద్​లో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఎడతెరిపిలేని వర్షంతో రోడ్లపై నీరు నిలిచి, చెరువులను తలపించాయి. పాఠశాలలు School, కళాశాలలు College వదిలే సమయం కావడంతో భారీ వర్షానికి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

    జంట నగరాల్లో భారీ వర్షాలకు బడి పిల్లలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సికింద్రాబాద్​లోని సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో వరద భారీగా చేరింది. దీంతో విద్యార్థులు బడి బయటకు రాలేని దుస్థితి. చివరికి తల్లిదండ్రులు బడి వద్దకు చేరుకున్నారు. తమ పిల్లలను జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లారు. ఇలా మహానగరం అంతటా ఎక్కడ చూసినా మోకాలి లోతు వరద నీరు చేరడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...