ePaper
More
    HomeతెలంగాణHeavy Rain | హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. ఆరెంజ్​ అలెర్ట్ జారీ.. అధికారులకు సీఎం కీలక...

    Heavy Rain | హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. ఆరెంజ్​ అలెర్ట్ జారీ.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Heavy Rain | హైదరాబాద్​ నగరంలో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడగా.. సాయంత్రం విజృంభించింది. రాత్రి తీవ్ర రూపం దాల్చింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

    ఈ రోజు (జులై 18) రాత్రి నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు నగరానికి ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    Heavy Rain | భారీగా ట్రాఫిక్​ జామ్​..

    మహా నగరంలో శుక్రవారం సాయంత్రం రెండు గంటల పాటు వాన దంచి కొట్టింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్​ జామ్ అయింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొండాపూర్‌, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్​ అయింది. సికింద్రాబాద్‌లోని ‘పైగా’ కాలనీ వర్షానికి నీట మునిగింది. దీంతో కాలనీలో ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది. అక్కడ పరిశ్రమలు, షోరూమ్​లలో పని చేస్తున్న ఉద్యోగులు చిక్కుకుపోయారు.

    READ ALSO  Chada Venkata Reddy | కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

    Heavy Rain | ప్రగతినగర్​లో ఇళ్లల్లోకి నీరు..

    ఐటీ ఉద్యోగులు అధికంగా ఉండే ప్రగతినగర్​లో వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచింది. ప్రగతినగర్​ చెరువు వద్ద ఉన్న అపార్ట్మెంట్​ సెల్లార్లలోకి వరద నీరు చేరింది. డ్రెయినేజీ వాటర్​ రివర్స్ కావడంతో అపార్ట్మెంట్​ వాసుల పరిస్థితి దుర్భంగా మారింది.

    Heavy Rain | అప్రమత్తంగా ఉండాలి సీఎం

    నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. GHMC, HMDA, వాటర్‌ వర్క్స్‌ సమన్వయంతో పని చేయాలని సూచించారు. SDRF, NDRF, హైడ్రా బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

    Latest articles

    BRSV | రేపు బనకచర్లపై బీఆర్​ఎస్​వీ రాష్ట్ర సదస్సు

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: BRSV | బనకచర్ల ప్రాజెక్ట్​ కారణంగా తెలంగాణ(Telangana)కు జరిగే అన్యాయంపై బీఆర్​ఎస్​వీ ఆధ్వర్యంలో రేపు...

    Central Government | 25 ఓటీటీలు, సైట్ల‌పై నిషేధం.. కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Central Government | అశ్లీష కంటెంట్‌ను ప్ర‌చారం చేస్తున్న ఓటీటీ(OTT)లు, వెబ్‌సైట్ల‌(Websites)పై కేంద్రం కొర‌డా ఝ‌ళిపించింది. 25...

    Bihar Former CM | తేజ‌స్వియాద‌వ్ ప్రాణాల‌కు ముప్పు.. బీహార్ మాజీ సీఎం ర‌బ్రీదేవి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Bihar Former CM | బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి, లాలూసింగ్ యాద‌వ్ స‌తీమ‌ణి ర‌బ్రీదేవి(Bihar Former CM...

    Junior Colleges | బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి

    అక్షర టుడే నిజాంసాగర్: Junior Colleges | విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్​...

    More like this