ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMLA Madan Mohan Rao | మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

    MLA Madan Mohan Rao | మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

    Published on

    అక్షరటుడే, లింగంపేట: MLA Madan Mohan Rao | మహిళలను కోటీశ్వరులుగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. శుక్రవారం లింగంపేట (Lingmapet) మండల కేంద్రంలోని జీఎన్​ఆర్​ గార్డెన్​లో (GNR Gardan) నిర్వహించిన నియోజకవర్గ ఇందిర మహిళ శక్తి సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

    MLA Madan Mohan Rao | అన్నిరంగాల్లో మహిళలు ముందుండాలి..

    మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఉద్దేశంతో ఈ ఏడాది ధాన్యం కొనుగోలు బాధ్యతను ఎక్కువ మొత్తంలో మహిళా సంఘాలకే (Women’s groups) అప్పగించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం మహిళ సంఘాలకు బ్యాంక్ లింకేజ్ (Bank linkage) ద్వారా రూ.20 కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేశారు. మహిళా సంఘాల సభ్యులకు కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు.

    ఈ కార్యక్రమంలో సెర్ప్ డైరెక్టర్ శ్రీ గోపాల్ రావు, డీఆర్​డీవో (DRDO) సురేందర్​, అడిషనల్ ఏపీడీ విజయలక్ష్మి, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ (Yella Reddy Market Committee) ఛైర్మన్ రజిత వెంకట్రామ్ రెడ్డి, వైస్ ఛైర్మన్ రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర నారా గౌడ్, లింగంపేట్ పాక్స్ ఛైర్మన్ దేవేందర్, డీపీఎంలు శ్రీనివాస్, సురేష్, సాయిలు, రాజయ్య, శోభారాణి, రాజేందర్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షుడు పుష్ప, మండల సమాఖ్య లింగంపేట్ అధ్యక్షుడు సులోచన, ఎల్లారెడ్డి నియోజకవర్గం మహిళా సమాఖ్య అధ్యక్షుడు మహిళా సంఘాల సభ్యులు ఏపీఎంలు సీసీలు, వీఓఏలు యంయస్ సిబ్బంది పాల్గొన్నారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...