అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raids | సైబరాబాద్ Cyberabad కమిషనరేట్ పరిధిలోని శామీర్‌పేట్ Shameerpet ఎస్సై SI ఎం. పరుశురామ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. పోలీస్ స్టేసన్‌లో నమోదైన కేసులో పేర్లు చేర్చకుండా ఉండటంతో పాటు, ఫోన్లు తిరిగి ఇవ్వడానికి ఎస్సై లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు రూ.రెండు లక్షల లంచం ఇచ్చారు. మరికొంత డబ్బు కావాలని ఎస్సై డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు బాధితుల నుంచి సోమవారం రూ.22 వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా.. గడిచిన పక్షం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు పోలీసు అధికారులు ఏసీబీకి చిక్కడం గమనార్హం.
