ePaper
More
    Homeఅంతర్జాతీయంAmerica | ఆమెతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కంపెనీ సీఈవో.. జీవితం క్ష‌ణాల‌లో తిర‌గ‌బ‌డిందిగా...!

    America | ఆమెతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కంపెనీ సీఈవో.. జీవితం క్ష‌ణాల‌లో తిర‌గ‌బ‌డిందిగా…!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: America | సాధార‌ణంగా ప‌లు ఈవెంట్స్‌లో కొన్నిజంట‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటాయి. ఈ క్ర‌మంలో అమెరికా(America)లోని మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లో గిల్లెట్ స్టేడియంలో జరిగిన కోల్డ్‌ప్లే కన్సర్ట్ లో ఓ జంట రెడ్ హ్యాండెడ్‌గా దొరకడం చర్చనీయాంశమైంది.

    ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తమ కంపెనీ హెచ్‌ఆర్‌ హెడ్‌ క్రిస్టిన్ క్యాబట్‌తో “ఆస్ట్రోనమర్” సీఈవో ఆండీ బ్రయన్(CEO Andy Bryan) సన్నిహితంగా గడుపుతూ అడ్డంగా దొరికిపోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తమ కంపెనీ ఉద్యోగి క్రిస్టిన్ క్యాబట్‌తో ఆండీ బ్రయన్ వ్యవహారం బయటకు పొక్క‌డంతో ఇప్పుడు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

    America | ఇలా జరిగిందేంటి..

    ఈ ఘటన మసాచుసెట్స్ (Massachusetts) రాష్ట్రం బోస్టన్‌లోని గిల్లెట్ స్టేడియం(Gillet Stadium)లో చోటు చేసుకుంది. కోల్డ్‌ప్లే కాన్సర్ట్‌లో ఒక దశలో “కిస్ క్యామ్” సెగ్మెంట్‌ మొదలైంది. ఈ సమయంలో స్క్రీన్‌పై ఓ జంట ద‌ర్శ‌న‌మిచ్చింది. మొదట్లో ఆ జంట ఆనందంగా కన్సర్ట్‌ను ఆస్వాదిస్తున్నట్టు కనిపించింది. దాంతో కెమెరా ఫోకస్ అయ్యారు. ఆ స‌మ‌యంలో వారిద్దరు త‌మ ఫేస్ క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. కాన్సెర్ట్‌లో సింగర్ క్రిస్ మార్టిన్ (Singer Chris Martin) ప్రేక్షకులతో మాట్లాడుతున్నప్పుడు చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. స్క్రీన్‌పై కనపడిన వెంటనే ఆస్ట్రోనమర్ సీఈవో ఆండీ బ్రయన్ ముఖం దాచుకుని బారికేడ్ల వెన‌క్కి వెళ్లి దాచుకోగా, ఆయనతో సన్నిహితంగా మెలిగిన మహిళ క్రిస్టిన్ క్యాబట్‌ చేతులతో ముఖాన్ని క‌వ‌ర్ చేసుకొని మెల్లిగా జరుకుంది.

    ఈ ఘటనతో గిల్లెట్ స్టేడియంలో ఉన్న వారంతా నవ్వుకున్నారు. దీన్ని గమనించిన సింగర్ క్రిస్ మార్టిన్ మాట్లాడుతూ.. “వావ్ ఏమిటిది.. వీళ్లు చాలా సిగ్గుపడుతున్నారేమో” అని అన్నారు. వీరిద్దరూ ఒకే కంపెనీకి చెందిన వారు కావడంతో, వారి సంబంధం ప్రస్తుతం పెద్ద వివాదానికి దారితీసింది.

    బైరన్ తన ప్రొఫైల్‌ను వెంటనే తొలగించగా, సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. కాగా, ఆండీ బైరన్ ఓ వివాహితుడు. అతని భార్య పేరు మేగన్ కెర్రిగన్ బైరన్. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాబట్ కూడా ఓ వివాహితురాలు. ఆమె భర్త పేరు కెన్నెత్ థార్న్‌బైన్. అయితే తన హెచ్ఆర్ డైరెక్టర్‌తో న‌డిపిన వ్య‌వ‌హారానికి సంబంధించిన‌ వీడియో వైరల్ కావ‌డంతో ఆండీ బ్రయన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ రాత్రి తాను తప్పు చేసినట్లుగా ఆ వీడియో చూసిన వారు భావిస్తున్నారని, ఈ క్ర‌మంలో తన భార్య, కుటుంబం, ఆస్ట్రోనమర్ టీమ్‌కు హృదయపూర్వకంగా క్షమాపణ చెబుతున్నానంటూ ఆయ‌న చెప్పుకొచ్చారు. మ‌రోవైపు ఆండీ భార్య మేగన్ కెరిగన్ బ్రయన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పలు మార్పులు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...