ePaper
More
    Homeబిజినెస్​Patanjali | పతంజలి ఫుడ్స్‌ బంపర్‌ ఆఫర్‌.. ఒక్కో షేరుకు 2 షేర్లు ఫ్రీ!

    Patanjali | పతంజలి ఫుడ్స్‌ బంపర్‌ ఆఫర్‌.. ఒక్కో షేరుకు 2 షేర్లు ఫ్రీ!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Patanjali | పతంజలి గ్రూపునకు చెందిన పతంజలి ఫుడ్స్‌ (Patanjali Foods) బంపర్‌ ఆఫర్‌ ఇవ్వనుంది. తన కంపెనీలో ఒక షేరు కలిగి ఉన్నవారికి రెండు షేర్లను బోనస్‌గా ఇవ్వాలని యోచిస్తోంది. 2:1 నిష్పత్తిలో బోనస్‌() షేర్లు జారీ చేయనుంది.

    ఈమేరకు బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కంపెనీ బోనస్‌ షేర్లను (Bonus Sahres) ప్రకటించడం ఇదే మొదటిసారి. రికార్డు డేట్‌ను (Record date) ప్రకటించాల్సి ఉంది. ఈ మేరకు ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్చేంచ్​ ఫైలింగ్స్‌లో పేర్కొంది. రూ.2 ఫేస్‌ వాల్యూ(Face value) కలిగిన 72,50,12,628 షేర్లను జారీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. రెండు నెలలలోపు బోనస్‌ షేర్ల జారీ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పేర్కొంది.

    Patanjali | ఇన్వెస్టర్లకు లాభాలపంట..

    దివాలా అంచున ఉన్న రుచి సోయాను (Ruchi soya) పతంజలి ఆయుర్వేద 2019లో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. పతంజలి కొనుగోలు చేయడంతో షేరు మల్టీ బ్యాగర్‌గా (Multi bagger) మారింది. అప్పటివరకు రూ.20లోపు ఉన్న షేరు ప్రస్తుతం రెండు వేల రూపాయలకు చేరువలో ట్రేడ్‌ అవుతోంది.
    బోనస్‌ ప్రకటన తర్వాత కంపెనీ షేర్లు ర్యాలీ తీశాయి. రెండు రోజుల్లోనే రూ.90 వరకు పెరిగి రూ.1,941 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. శుక్రవారం మార్కెట్లు నెగెటివ్‌గా ఉన్నా.. పతంజలి షేర్‌ మాత్రం లాభాలతో కొనసాగుతుండడం గమనార్హం.

    More like this

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...