ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Former MLA Baji Reddy | ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడ్తారా..? మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి

    Former MLA Baji Reddy | ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడ్తారా..? మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Former MLA Baji Reddy | రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

    ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నారై సెల్​పై (NRI Cell) ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashnth reddy) నిలదీశారన్నారు. ఇచ్చిన హామీని ప్రశ్నించినందుకే వేల్పూర్ (Velpur) ఘటన చోటుచేసుకుందన్నారు. ఒక ఎమ్మెల్యే ఇంటికి కాంగ్రెస్ నాయకుడు అక్రమంగా ప్రవేశించడమే కాకుండా వీడియోలు తీయడం సమంజసం కాదన్నారు. ఆయనను వదిలేసి తమ కార్యకర్తలపై కేసులు వేయడం సిగ్గుచేటన్నారు.

    Former MLA Baji Reddy | సెల్ఫ్ ప్రొటెక్షన్​లో భాగమే..

    తమ పార్టీ ఎమ్మెల్యే ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తిని సెల్ఫ్ ప్రొటెక్షన్​లో (Self-protection) భాగంగానే తరిమికొట్టామని బాజిరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసులు (Friendly Police) లేరని.. ఎనిమీ పోలీసులుగా తయారయ్యారని ఆరోపించారు.

    కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా.. ఎంతమంది అరెస్ట్ చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. రెండు జాతీయ పార్టీలు అభివృద్ధిపై కాకుండా నాయకుల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయని విమర్శించారు. సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ విఠల్, బాజిరెడ్డి జగన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...