ePaper
More
    HomeFeaturesAprilia SR 175 | ఏప్రిలియా నుంచి ప్రీమియం స్కూటర్‌.. ధర, ఫీచర్స్‌ తెలుసుకుందామా

    Aprilia SR 175 | ఏప్రిలియా నుంచి ప్రీమియం స్కూటర్‌.. ధర, ఫీచర్స్‌ తెలుసుకుందామా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Aprilia SR 175 | ఇటలీకి చెందిన స్కూటర్‌ తయారీ కంపెనీ ఏప్రిలియా భారత్‌లో మరో ప్రీమియం స్కూటర్‌ను విడుదల చేసింది. ఎస్‌ఆర్‌ 175 (SR 175) పేరుతో దీనిని తీసుకువచ్చింది. ఈ మోడల్‌ గతంలో తీసుకొచ్చిన ఎస్‌ఆర్‌ 160ను పోలి ఉంటుంది. అయితే దీని ఇంజిన్‌ సామర్థ్యం అధికం కావడంతో మెరుగైన పనితీరు కనబరుస్తుందని భావిస్తున్నారు. ఈ టూ వీలర్‌లోని శక్తిమంతమైన ఇంజిన్‌, ఆధునిక ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తాయని భావిస్తున్నారు. 174.7 సీసీ సామర్థ్యం గల ఈ స్కూటర్‌ ధర, ఫీచర్స్‌ తెలుసుకుందామా..

    ఏప్రిలియా ఎస్‌ఆర్‌ 175 (Aprilia SR 175) మోడల్‌లో 174.7 సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌ కూల్డ్‌ మోటార్‌ (Single Cylinder Aircooled Motor) అమర్చారు. ఇది 7,200 ఆర్‌పీఎం వద్ద 13.08 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని, 6000 ఆర్‌పీఎం వద్ద 14.14 ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    ముందు, వెనుక భాగాల్లో 14 అంగుళాల alloy wheelsను అమర్చారు. వెడల్పు 120 సెక్షన్‌గా ఉంది.
    సస్పెన్షన్‌ విధులను టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ ఫోర్కులు, వెనక మోనోషాక్‌ నిర్వహిస్తాయి. బ్రేకింగ్‌ వ్యవస్థలో ముందు భాగంలో 220 ఎంఎం డిస్క్‌ బ్రేక్‌, వెనక భాగంలో డ్రమ్‌ బ్రేక్‌ ఉన్నాయి. సింగిల్‌ చానల్‌ ఏబీఎస్‌ (Single Channel ABS) భద్రతను పెంచుతుంది. ఫ్రేమ్‌, సస్పెన్షన్‌, బ్రేక్‌లు, టైర్లు వంటి భాగాలు ఎస్‌ఆర్‌160 మోడల్‌ మాదిరిగానే ఉన్నాయి.

    ఇది రెడ్‌ వైట్‌ లేదా పర్పుల్‌ రెడ్‌ కాంబినేషన్‌లో వస్తోంది. వినియోగదారులను ఆకర్షించేలా బ్రాండ్‌ మిడిల్‌ వెయిట్‌ స్పోర్ట్‌ బైక్‌ ఆర్‌ఎస్‌ 457ను పోలిన కొత్త పెయింట్‌ స్కీమ్‌తో దీన్ని తీర్చిదిద్దారు. ఈ స్కూటర్‌ను ఆధునిక టెక్నాలజీతో (Latest Technology) తీసుకువచ్చారు. ఇందులో కలర్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, బ్లూటూత్‌ కనెక్టివిటీ, కాల్‌ నోటిఫికేషన్లు, అలర్టులు, మ్యూజిక్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ను స్కూటర్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు.

    స్పోర్టీ డిజైన్‌, ఆకర్షణీయమైన ఫీచర్లతో తీసుకువచ్చిన ఈ మోడల్‌ ఎక్స్‌ షోరూం ధర (Ex-showroom Price) రూ. 1.26 లక్షల నుంచి రూ. 1.33 లక్షల వరకు ఉంటుంది. ఇది హీరో జూమ్‌ 160 (Hero Xoom 160), యమహా ఏరోక్స్‌ 155 మోడళ్లకు పోటీదారుగా నిలుస్తుందని భావిస్తున్నారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...