ePaper
More
    HomeజాతీయంLiquor Scam | లిక్కర్​ స్కామ్​లో మాజీ సీఎం కుమారుడి అరెస్ట్​

    Liquor Scam | లిక్కర్​ స్కామ్​లో మాజీ సీఎం కుమారుడి అరెస్ట్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Liquor Scam | ఛత్తీస్​గఢ్​ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్​ (Bhupesh Baghel)కు ఈడీ అధికారులు షాక్​ ఇచ్చారు. మద్యం కుంభకోణం కేసులో ఆయన కుమారుడు చైతన్య బఘేల్‌ (Chaitanya Baghel)ను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రూ.2,100 కోట్ల లిక్కర్ స్కామ్​కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో (Money Laundering Case) ఆయనను అరెస్ట్​ చేసినట్లు ఈడీ తెలిపింది.

    ఛత్తీస్‌గఢ్‌ లిక్కర్​ స్కామ్​తో ​(Liquor Scam) రాష్ట్ర ఆదాయానికి నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్​ హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ కుమారుడి పాత్ర ఉందని అభియోగాలు వచ్చాయి. దీంతో ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపడుతోంది. ఈ స్కామ్​లో రూ.2,160 కోట్ల మనీ లాండరింగ్​లో చైతన్య బఘేల్​ పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయనను అరెస్ట్​ చేశారు. దుర్గ్‌ జిల్లా(Durg District)లోని భిలాయ్‌ ప్రాంతంలో గల బఘేల్‌ నివాసానికి చేరుకొని అధికారులు సోదాలు చేశారు. అనంతరం చైతన్య బఘేల్​ను అరెస్ట్​ చేశారు.

    READ ALSO  Parliament | నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల​ సమావేశాలు.. దద్దరిల్లనున్న ఉభయ సభలు

    Liquor Scam | పుట్టిన రోజే అరెస్ట్​

    చైతన్య బఘేల్​ అరెస్ట్​తో ఆ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తన కుమారుడిని అరెస్ట్​ చేశారని బఘేల్​ ఆరోపించారు. మరోవైపు ఆయన ఇంటికి భారీ ఎత్తున కాంగ్రెస్​ నాయకులు(Congress Leaders), కార్యకర్తలు చేరుకున్నారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు చైతన్య బఘేల్​ పుట్టిన రోజు కావడం గమనార్హం.

    బర్త్​ డే రోజే ఆయనను ఈడీ అధికారులు(ED Officers) అరెస్ట్​ చేశారు. తన కుమారుడి అరెస్ట్‌ఫై మాజీ ముఖ్యమంత్రి బఘేల్‌ స్పందించారు. ఈడీ తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు. తాము ఏ తప్పు చేయలేదని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ స్కామ్‌లో ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, లిక్కర్ వ్యాపారులు కలిసి అక్రమంగా సంపాదించారని ఈడీ పేర్కొంది.

    READ ALSO  Alimony | మాజీ భార్యకు భరణం చెల్లించేందుకు చోరీల బాట.. తర్వాత ఏం జరిగిందంటే..!

    Latest articles

    Abhigyan Malviya | ఆర్మూర్ సబ్ కలెక్టర్​గా అభిజ్ఞాన్​ మాల్వియా

    అక్షరటుడే, ఆర్మూర్ : Abhigyan Malviya | ఆర్మూర్ సబ్ కలెక్టర్​గా (Armoor Sub-Collector) అభిజ్ఞాన్​ మాల్వియా నియమితులయ్యారు....

    Bombay Trains Blast Case | బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే.. నిందితుల‌కు నోటీసులు జారీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:Bombay Trains Blast Case | ముంబై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన...

    Double Bedroom Houses | దీపావళిలోపు డబుల్ బెడ్ రూమ్​ ఇళ్లు ఇవ్వాలి

    అక్షరటుడే, ఇందూరు: Double Bedroom Houses |  అర్బన్ నియోజకవర్గంలో దీపావళి (Diwali) లోపు 3,500 ఇళ్లను మంజూరు...

    Flight Missing | రష్యాలో విమానం మిస్సింగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Flight Missing | రష్యాలో విమానం మిస్​ అయింది. అంగారా ఎయిర్‌లైన్స్ విమానం(Airlines Plane)...

    More like this