ePaper
More
    HomeతెలంగాణExcise Police | పాల ప్యాకెట్ల రూపంలో కల్తీ కల్లు విక్రయం

    Excise Police | పాల ప్యాకెట్ల రూపంలో కల్తీ కల్లు విక్రయం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Excise Police | కల్తీ కల్లుకు బానిసలై ఎంతో మంది బలి అవుతున్నారు. మత్తు పదార్థాలతో తయారు చేసిన ఈ కల్లుకు అలవాటు పడిన వారికి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

    ఇటీవల హైదరాబాద్​ నగరంలోని కూకట్​పల్లి(Kukat Pally)లో కల్తీ కల్లు తాగి 8 మంది చనిపోగా చాలా మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయినా కల్తీ కల్లు(Kalthi Kallu) విక్రయాలు మాత్రం ఆగడం లేదు. అధికారులకు దొరకకుండా కల్తీ కల్లు అమ్మే వారు కొత్త కొత్త దారులు అవలంభిస్తున్నారు. తాజాగా పాల ప్యాకెట్ల (Milk Packets) రూపంలో కల్లు విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్​ అధికారులు(Excise Officers) అరెస్ట్​ చేశారు.

    మేడ్చల్‌ (Medchal)లోని అయోధ్య నగర్‌లోని గుండ్లపోచంపల్లిలోని (Gundlapochampally) ఒక హోటల్‌లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఎస్​వీఎస్​ బ్రాండ్ (SVS Brand)​ పేరుతో పాల ప్యాకెట్ల రూపంలో కల్తీ కల్లు అమ్ముతున్నట్లు వారు గుర్తించారు. 270 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకున్నారు. శంకర్ గౌడ్ నిర్వహిస్తున్న హోటల్​లో అనుమతి లేకుండా మద్యం అమ్ముతున్నట్లు తెలిసింది. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇతర చోట్ల కూడా ఎక్సైజ్​ అధికారులు ఆకస్మికంగా దాడులు చేపట్టారు. మల్కాజ్‌గిరి పరిధిలో 20 లీటర్లు కల్లు స్వాధీనం చేసుకున్నారు. సైదాబాద్‌లో 750 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకున్నారు. పల్లె భిక్షపతి, బోడిగే శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...