అక్షరటుడే, వెబ్డెస్క్: Padma awards | పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో మొదలైంది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేస్తున్నారు. కాగా.. 2025కు గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు వారికి ఏడు అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణ(Telangana)కు రెండు దక్కగా.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు ఐదు లభించాయి. తెలంగాణ నుంచి ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణకు(పద్మశ్రీ), వైద్య విభాగంలో నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషన్ అవార్డులు వరించాయి.
సినీ రంగం నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్, ఏపీ నుంచి విద్య, సాహిత్యం విభాగంలో కేఎల్ కృష్ణ పద్మశ్రీ, కళారంగంలో నాగఫణి శర్మకు పద్మశ్రీ, విద్య, సాహిత్యం విభాగంలో రాఘవేంద్రచార్యకు పద్మశ్రీ, కళారంగంలో అప్పారావుకు పద్మశ్రీ లభించాయి. కాగా.. ఈ వేడుకకు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు హాజరయ్యారు.
#WATCH | Actor and Andhra Pradesh MLA Nandamuri Balakrishna receives Padma Bhushan award from President Droupadi Murmu for his contribution to the field of Art.
(Video Source: President of India/YouTube) pic.twitter.com/YAHohendso
— ANI (@ANI) April 28, 2025