ePaper
More
    HomeతెలంగాణSriram Sagar | శ్రీరాంసాగర్​లోకి స్వల్ప ఇన్​ఫ్లో

    Sriram Sagar | శ్రీరాంసాగర్​లోకి స్వల్ప ఇన్​ఫ్లో

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Sriram Sagar | వర్షాకాలం సీజన్​ మొదలై నెల రోజులు దాటిపోయిన శ్రీరాంసాగర్​కు అంతంత మాత్రంగానే ఇన్​ఫ్లో వస్తోంది. మహారాష్ట్రతో పాటు నిజామాబాద్​, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) లేకపోవడంతో జలాశయంలోకి ఎగువను వరద రావడం లేదు. స్థానికంగా కురిసిన వర్షాలతో స్వల్పంగా ఇన్​ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు.

    ప్రస్తుతం ప్రాజెక్టులోకి 608 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది. ఆవిరి రూపంలో 277 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా శుక్రవారం ఉదయానికి 1068.5 అడుగుల (20.9టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్ట్​లో 14.356 టీఎంసీల నీరు ఉంది.

    READ ALSO  Betting Apps | బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దూకుడు.. రానా, ప్రకాశ్​రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండకు నోటీసులు..!

    Sriram Sagar | నిలకడగా నీటిమట్టం

    వర్షాలు లేకపోవడంతో ఈ ఏడాది శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​లోకి (Sriram Sagar Project) అంతగా వరద రాలేదు. బాబ్లీ ప్రాజెక్ట్​ గేట్లు ఎత్తినప్పటికీ అక్కడ కూడా వర్షాలు లేకపోవడంతో వరద రావడం లేదు. స్థానికంగా కురిసిన వర్షాలకు తోడు ఈ నెల 1 బాబ్లీ ఎత్తిన సందర్భంగా మొదట్లో 6 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చింది. ఆదివారం 3,653 క్యూసెక్యులు, సోమవారం 2,172 క్యూసెక్యులు రాగా మంగళవారం నుంచి 600 క్యూసెక్కులకు తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్ట్​ నీటిమట్టం నిలకడగా ఉంది. ప్రతి ఏడాది జులై చివర, ఆగస్టులో ఎస్సారెస్పీకి భారీ వరద వస్తుంది.

    Latest articles

    Weather Updates | తెరిపినివ్వని వాన.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి వర్షం పడుతూనే ఉంది. రెండు రోజులుగా...

    Warangal NIT | వరంగల్‌ నిట్‌లో ఉద్యోగావకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal NIT | వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో (National Institute of...

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    Donald Trump | ట్రంప్‌కు అప్పీల్స్ కోర్టు షాక్‌.. జన్మతః పౌరసత్వంపై కీల‌క ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ త‌గిలింది. జన్మతః పౌరసత్వంపై ట్రంప్...

    More like this