ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Mla Rakesh Reddy | మొక్కలతోనే భావితరాలకు భవిష్యత్తు

    Mla Rakesh Reddy | మొక్కలతోనే భావితరాలకు భవిష్యత్తు

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్‌: Mla Rakesh Reddy | ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, భావితరాలకు కాలుష్యం లేని పర్యావరణం అందించాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని లేఅవుట్‌ స్థలాల్లో మున్సిపాలిటీకి (Armoor Municipality) కేటాయించిన 10శాతం స్థలాలను కమిషనర్‌ రాజుతో కలిసి పరిశీలించారు.

    Mla Rakesh Reddy | ఖాళీస్థలాల్లో పార్క్​లు ఏర్పాటు చేయాలి..

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లేఅవుట్లలోని (Muncipal layouts) ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలని, తద్వారా భావితరాలకు భవిష్యత్తునిచ్చిన వారమవుతామన్నారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పార్కులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

    ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాలని కమిషనర్‌ను ఆదేశించారు. అనంతరం గుండ్ల చెరువు (Gundla cheruvu) వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆయన వెంట బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలు, మున్సిపల్‌ అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

    More like this

    Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి సొసైటీ ఛైర్మన్​ రాజీనామా

    అక్షరటుడే, బోధన్​: Maggari Hanmandlu | జిల్లాలో బీఆర్​ఎస్ (Brs Nizamabad)​ పార్టీలో తొలి రాజీనామా నమోదైంది.  కేసీఆర్​...

    Nepal PM Resigns | నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal PM Resigns | నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి...

    Best Teacher Award | నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి

    అక్షరటుడే, ఇందూరు : Best Teacher Award | విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకుల చదువులు కాకుండా.. నైతిక...