అక్షరటుడే, ఇందూరు: Sports Summer camps | వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను మే 1వ తేదీ నుంచి నెలరోజుల పాటు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడాధికారి (District Youth and Sports Officer) ముత్తెన్న తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. బాల్‌బ్యాడ్మింటన్ (Ball badminton)కు పీటీఈ శ్రీనివాస్, బేస్‌బాల్ (Baseball)కు పీడీ సుజాత, బాస్కెట్‌బాల్‌కు (Basketball) సీనియర్ క్రీడాకారులు సాయిరాం, హ్యాండ్‌బాల్‌కు (Handball) పీడీ అజ్మత్‌ఖాన్, హాకీకి పీడీ స్వామి కుమార్, కబడ్డీకి పీఈటీ వినోద్‌నాయక్, ఖోఖోకు పీఈటీ గంగామురళి, నెట్‌బాల్‌కు పీటీటీ కుమార్, సాఫ్ట్‌బాల్‌కు పీడీ గంగామోహన్, వాలీబాల్‌కు పీడీ యాదగిరిని శిక్షకులుగా నియమించామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు శిక్షకులను సంప్రదించి శిబిరాలకు హాజరుకావాలని సూచించారు.