ePaper
More
    Homeఅంతర్జాతీయంBalochistan | పాక్​ సైన్యానికి చుక్కలు చూపిస్తున్న బీఎల్​ఏ.. రెండు దాడుల్లో 39 మంది హతం..

    Balochistan | పాక్​ సైన్యానికి చుక్కలు చూపిస్తున్న బీఎల్​ఏ.. రెండు దాడుల్లో 39 మంది హతం..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Balochistan | పాకిస్తాన్​ సైన్యానికి బలోచిస్తాన్​ వేర్పాటువాదులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న దాయాదీ దేశానికి బలూచ్​ లిబరేషన్‌ ఆర్మీ (Baloch Liberation Army) నిద్ర పట్టనివ్వడం లేదు. పాక్​ సైనికులే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. రెండు రోజుల్లో ఏకంగా 39 మంది సైనికులు బీఎల్​ఏ దాడుల్లో మృతి చెందారు.

    Balochistan | బస్సుపై దాడి

    కరాచీ నుండి క్వెట్టాకు వెళ్తున్న సైనిక బస్సుపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. ఈ ఘటనలో 29 మంది పాకిస్తానీ సైనికులు (Pakistani Soldiers) చనిపోయారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA), బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) రెండు సంస్థలు పాక్​ సైనికులే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. వేర్వేరు ఘటనల్లో ఈ సంస్థల దాడుల్లో 39 మంది సైనికులు చనిపోయారు. బీఎల్​ఎఫ్​ కలాట్, ఝౌలలో కూడా దాడులు చేయగా పది మంది చనిపోయారు.

    READ ALSO  Fighter Jet Crash | బంగ్లాదేశ్​ విమాన ప్రమాద బాధితులకు అండగా భారత్​

    Balochistan | వరుస దాడులు

    క్వెట్టాలోని హజర్ గంజి (Quetta Hajar Gunji) ప్రాంతంలో బీఎల్​ఏ సభ్యులు ఐఈడీ పేల్చారు. ఈ దాడిలో ఇద్దరు సైనికులు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. మంగళవారం కలాత్‌లోని ఖజినా (Kalat Khajina) ప్రాంతంలో మరో ఘటనలో నలుగురు సైనికులను చంపినట్లు బీఎల్​ఏ ప్రకటించింది. బుధవారం గుజ్రోకొర్‌ ప్రాంతంలో దాడు చేసి ఆరుగురు సైనికులను హతమార్చినట్లు పేర్కొంది.

    బలూచిస్తాన్​పై పాక్​ ఆక్రమణలకు వ్యతిరేకంగా తాము యుద్ధం చేస్తున్నట్లు బీఎల్​ఏ ప్రతినిధి జియంద్ బలూచ్ (BLA Spokesperson Ziand Baloch) తెలిపారు. కాగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్​ వరకు బలోచ్‌ రెబల్స్‌ మొత్తం 286 దాడులు చేశారు. ఈ దాడుల్లో 700 మంది వరకు మృతి చెందారు. గతంలో పలు ప్రాంతాలను కూడా బీఎల్​ఏ స్వాధీనం చేసుకుంది.

    READ ALSO  Delta Airlines | గాలిలో ఉండగా విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం : వీడియో

    Latest articles

    KTR | ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

    అక్షరటుడే, లింగంపేట: KTR | మండల కేంద్రంలో గురువారం కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...

    NSDL | ఎదురుచూపులకు తెర.. ఎట్టకేలకు పబ్లిక్‌ ఇష్యూకు ఎన్‌ఎస్‌డీఎల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:NSDL | ఇన్వెస్టర్లు ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న ఐపీవో(IPO) రాక ఖరారయ్యింది. ప్రపంచంలోని అతిపెద్ద డిపాజిటరీ సంస్థల్లో ఒకటైన...

    Stock Market | ఐటీ స్టాక్స్‌లో భారీ పతనం.. నష్టాలతో ముగిసిన ప్రధాన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | ప్రధాన కంపెనీల క్యూ1 ఫలితాలు నిరాశపరచడం, ఎఫ్‌ఐఐలు పెట్టుబడులు ఉపసంహరిస్తుండడం, యూఎస్‌తో వాణిజ్య...

    Sri chaitanya School | ‘శ్రీచైతన్య’లో తరగతుల నిర్వహణకు డీఈవో అనుమతి నిరాకరణ

    అక్షరటుడే, బాన్సువాడ: Sri chaitanya School | పట్టణంలోని వీక్లీ మార్కెట్(Weekly market) వద్ద శ్రీచైతన్య స్కూల్​ను అనుమతులు...

    More like this