ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిHome Guards | హోంగార్డులకు ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట సేవా పతకాలు

    Home Guards | హోంగార్డులకు ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట సేవా పతకాలు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Home Guards | జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు హోంగార్డులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (Union Home Ministry) అందించే ఉత్కృష్ట (Excellent medal), అతి ఉత్కృష్ట పతకాలకు (most excellent medal) ఎంపికయ్యారు. వీరిలో ఇద్దరు హోంగార్డులు తమ ప్రాణాలకు తెగించి మరో ఇద్దరిని కాపాడగా.. నిబద్ధతతో పోలీస్​శాఖకు సేవచేస్తున్న మరొకరికి పతకాలు దక్కాయి.

    Home Guards | చెరువులో దూకి ప్రాణాలు కాపాడి..

    పిట్లం (Pitlam) మండలంలో చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయగా బ్లూకోర్టు హోంగార్డు మారుతి చెరువు మధ్యలోకి వెళ్లి ఆమెను రక్షించాడు. అలాగే కామారెడ్డిలో రైల్వేట్రాక్‌పై ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను సమయస్ఫూర్తితో హోంగార్డు వసంత్ కాపాడాడు. వీరిరువురికి ఉత్కృష్ట పతకం లభించింది.

    Home Guards | 31 ఏళ్లుగా పోలీసుశాఖలో నిబద్ధతతో..

    పోలీసు శాఖలో (Police department) నిబద్ధతతో 31 ఏళ్లుగా ఉత్తమ సేవలందిస్తూ ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు మల్లికార్జున్ అతి ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ముగ్గురు హోంగార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాలోని హోంగార్డుల సేవలను గుర్తించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పతకాలను ప్రకటించడం జిల్లాకు గర్వకారణమన్నారు.

    Home Guards | ఉత్తమ సేవలకు ప్రతీకలుగా..

    ఇది పోలీస్ శాఖలో సేవా తత్పరతకు ప్రతీకగా నిలుస్తోందని ఎస్పీ తెలిపారు. అదేవిధంగా, హోంగార్డు సేవలో ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా ఉత్తమ సేవలు అందిస్తున్న వారితో పాటు, ప్రజల ప్రాణాలను రక్షించిన వారికి ఈ పతకాలు ప్రతి ఏడాది ప్రోత్సాహకంగా ఇవ్వబడతాయని పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న హోంగార్డులు తమ సేవలో నిబద్ధత, విశ్వసనీయత చూపించి, ఇలాంటి గౌరవ పతకాలు మరెన్నో అందుకునేలా విధులు నిర్వహించాలని ఎస్పీ ఆకాంక్షించారు.

    More like this

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....