ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | విలన్లు క్లైమాక్స్​లో అరెస్ట్​ అవుతారు.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    CM Revanth Reddy | విలన్లు క్లైమాక్స్​లో అరెస్ట్​ అవుతారు.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth Reddy | గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ కొనసాగుతోందని, విలన్లు క్లైమాక్స్​లో అరెస్టు అవుతారని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో చిట్​చాట్ (Media Chit Chat) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విలన్లు ప్రతిసారి క్లైమాక్స్​లోనే అరెస్ట్​ అవుతారని.. ఆ విషయంలో తనకు తొందర లేదన్నారు.

    కేంద్రంతో చర్చలు జరుపకుంటే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించి పలు ముఖ్యమైన అంశాలను కేంద్ర మంత్రులతో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ఇండియా – పాకిస్తాన్(India – Pakistan)​ మధ్యే నీటి పంపిణీపై చర్చలు జరుగుతుంటే.. తాను పక్క రాష్ట్రం సీఎంతో మాట్లాడితే తప్పేంటని ఆయన అన్నారు.

    CM Revanth Reddy | ఫామ్​హౌస్​కు వెళ్తే పనులు కావు

    తన ఢిల్లీ పర్యటనలపై బీఆర్​ఎస్​ నాయకులు (BRS Leaders) చేస్తున్న విమర్శలకు సీఎం కౌంటర్​ ఇచ్చారు. ప్రజలు తనకు అధికారం ఇచ్చారని.. వారి సమస్యలను కేంద్ర ప్రభుత్వం (Central Government) దృష్టికి తీసుకెళ్లడం తన బాధ్యత అన్నారు. ఢిల్లీకి కాకుండా ఫామ్ హౌస్‌కు వెళ్తే రాష్ట్ర సమస్యలు పరిష్కారం కావు అని పరోక్షంగా కేసీఆర్ ​(KCR)పై విమర్శలు చేశారు. నెలకు రెండు సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో సమావేశం అవుతానని స్పష్టం చేశారు.

    CM Revanth Reddy | గంజాయి బ్యాచ్​కు భయపడను

    తాను గంజాయి బ్యాచ్​కు భయపడనని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. కేటీఆర్ డ్రగ్స్ కేసుపై, బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ కొనసాగుతుందన్నారు. కేసీఆర్‌తో అసెంబ్లీలో చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే ఇటీవల కేటీఆర్(KTR)​ చర్చకు రావడంపై ఆయన వ్యంగ్యంగా స్పందించారు. కేటీఆర్ నాయకత్వాన్ని ఆయన చెల్లెలు కవితే అంగీకరించడం లేదని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్లపై(BC Reservations) తమకు వ్యూహం ఉందని ఆయన వెల్లడించారు. తాను చంద్రబాబు సమావేశం అయితే బీఆర్​ఎస్​ నాయకులు హంగామా చేస్తున్నారని, గతంలో కేటీఆర్, లోకేశ్​ల మీటింగ్ సంగతేమిటని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్​ కుటుంబం కడుపులో విషం పెట్టుకొని మాట్లాడుతుందని విమర్శించారు. కేసీఆర్​ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలన్నారు.

    CM Revanth Reddy | పాత పథకాలు కొనసాగుతున్నాయి

    బతుకమ్మ చీరలు, కేసీఆర్​ కిట్​ మినహా పాత పథకాలు అన్ని కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. అయినా బీఆర్​ఎస్​ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేంద్రంతో పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు. అయితే కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి (Union Minister Kishan Reddy) లేఖలు రాయడం మాని, ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...