ePaper
More
    Homeబిజినెస్​Tech Mahindra | టెక్‌ మహీంద్రా లాభాలు జంప్‌.. అయినా పడిపోయిన షేరు ధర

    Tech Mahindra | టెక్‌ మహీంద్రా లాభాలు జంప్‌.. అయినా పడిపోయిన షేరు ధర

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Tech Mahindra | వివిధ పరిశ్రమలకు టెక్నాలజీ కన్సల్టింగ్‌(Technology Consulting), డిజిటల్‌ సొల్యూషన్స్‌ అందించే టెక్‌ మహీంద్రా ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో మిశ్రమ ఫలితాలను వెలువరించింది. బలమైన లాభ వృద్ధి, డీల్‌ విన్స్‌ ఉన్నప్పటికీ అమెరికాలో అనిశ్చితులతో ఆదాయం తగ్గడంతో మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఫలితాలు ప్రకటించిన తర్వాత షేరు ధర(Share Price) 2 శాతం వరకు పడిపోయింది.

    లార్జ్‌ క్యాప్‌(Large cap) కేటగిరికి చెందిన ఐటీ సెక్టార్‌ స్టాక్‌ అయిన టెక్‌ మహీంద్రా(Tech Mahindra) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను బుధవారం ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఇయర్‌ ఆన్‌ ఇయర్‌(Year On Year) ప్రాతిపదికన 33.95 శాతం పెరిగి రూ. 1,140.6 కోట్లుగా నమోదయ్యింది. ఆపరేషన్స్‌నుంచి రెవెన్యూ(Revenue From Operations) 2.65 శాతం పెరిగి రూ. 13,351.2 కోట్లు రికార్డు చేసింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 13,005 కోట్లుగా ఉంది.

    READ ALSO  Malabar Gold and Diamonds Showroom | మలబార్​లో ఆర్టిస్ట్రీ షో

    Tech Mahindra | యూఎస్‌ మార్కెట్‌లో తగ్గిన ఆదాయం..

    కంపెనీ మొత్తం టాప్‌లైన్‌(Top line)లో దాదాపు సగం వాటా ఉన్న అమెరికా మార్కెట్‌(America Market) నుంచి వచ్చే ఆదాయం గతేడాదితో పోలిస్తే 5.9 శాతం తగ్గింది. టెక్‌ మహీంద్రా కొత్త బుకింగ్‌ల విలువ 809 మిలియన్‌ డాలర్లకు పెరిగింది. గత క్వార్టర్‌లో వీటి విలువ 798 మిలియన్‌ డాలర్లు ఉంది. గత సంవత్సరం(Last year) ఇదే కాలంలో 534 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.
    టెక్‌ మహీంద్రా పనితీరు నిలకడగా పెరుగుతోందని కంపెనీ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మోహిత్‌ జోషి తెలిపారు. చివరి పన్నెండు నెలల ప్రాతిపదికన డీల్స్‌ 44 శాతం పెరిగాయన్నారు. అన్ని వెర్టికల్స్‌లో, అన్ని భౌగోళిక ప్రాంతాల్లో వృద్ధి కనిపిస్తోందన్నారు. వరుసగా ఏడు క్వార్టర్లలో మార్జిన్‌ విస్తరణను సాధించామని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రోహిత్‌ ఆనంద్‌ తెలిపారు. ఇది తమ సంస్థ అంతటా క్రమశిక్షణకు నిదర్శనమన్నారు.

    READ ALSO  Stock Markets | నష్టాల్లో ముగిసిన సూచీలు

    Tech Mahindra | స్టాక్‌ పనితీరు..

    టెక్‌మహీంద్రా షేరు 52 వారాల గరిష్ట ధర రూ. 1,807.70 కాగా.. 52 వారాల కనిష్ట ధర రూ. 1,209.40 గా ఉంది. గత Trading సెషన్‌లో ఈ స్టాక్‌ ధర 1.7 శాతం పడిపోయి రూ. 1,607 వద్ద ఉంది. ఈ కంపెనీ ఇన్వెస్టర్ల(Investors)కు వారం రోజుల్లో సుమారు ఒక శాతం నష్టాన్ని, నెల రోజుల్లో 8 శాతం నష్టాన్ని అందించింది. ఏడాది కాలంలో 3 శాతం, ఐదేళ్లలో 163 శాతం లాభాలను ఇచ్చింది.

    Latest articles

    Chittoor | ల్యాబ్​ టెక్నీషియన్​తో విద్యార్థి ప్రేమ.. ఇద్దరు కలిసి జంప్​.. తర్వాత ఏం జరిగిందంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Chittoor | ప్రస్తుతం సమాజంలో మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. ప్రేమ, డబ్బు కోసం కొందరు ఎంతకైనా...

    IT Raids on Mallareddy | మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IT Raids on Mallareddy | మాజీ మంత్రి, మేడ్చల్​ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఐటీ అధికారులు...

    Mla Pocharam | శాంతి దూత ఏసుప్రభువు: ఎమ్మెల్యే పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | సమాజానికి శాంతి, ప్రేమను ప్రభోదించిన శాంతి దూత ఏసుక్రీస్తు (Jesus Christ)...

    Parliament Sessions | పార్ల‌మెంట్‌లో వాయిదాల ప‌ర్వం.. నిమిషానికి రూ.2.50 ల‌క్ష‌ల ప్ర‌జాధ‌నం వృథా

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Parliament Sessions | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతోంది. ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌ల‌తో ఉభ‌య...

    More like this

    Chittoor | ల్యాబ్​ టెక్నీషియన్​తో విద్యార్థి ప్రేమ.. ఇద్దరు కలిసి జంప్​.. తర్వాత ఏం జరిగిందంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Chittoor | ప్రస్తుతం సమాజంలో మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. ప్రేమ, డబ్బు కోసం కొందరు ఎంతకైనా...

    IT Raids on Mallareddy | మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IT Raids on Mallareddy | మాజీ మంత్రి, మేడ్చల్​ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఐటీ అధికారులు...

    Mla Pocharam | శాంతి దూత ఏసుప్రభువు: ఎమ్మెల్యే పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | సమాజానికి శాంతి, ప్రేమను ప్రభోదించిన శాంతి దూత ఏసుక్రీస్తు (Jesus Christ)...