ePaper
More
    HomeతెలంగాణCI Suspended | ఉప్పల్‌ సీఐ ఎలక్షన్‌ రెడ్డి సస్పెన్షన్​.. ఎందుకో తెలుసా!

    CI Suspended | ఉప్పల్‌ సీఐ ఎలక్షన్‌ రెడ్డి సస్పెన్షన్​.. ఎందుకో తెలుసా!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CI Suspended | హైదరాబాద్​ నగరంలోని ఉప్పల్​ సీఐ ఎలక్షన్​ రెడ్డి(Uppal CI Election Reddy)ని ఉన్నతాధికారులు సస్పెండ్​ చేశారు. హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ (Hyderabad Cricket Association) లో అనేక అక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే హెచ్​సీఏ స్కామ్​లో సీఐ ఎలక్షన్‌ రెడ్డి తలదూర్చారు. దీంతో అధికారులు ఆయనపై వేటు వేశారు.

    CI Suspended | సమాచారం లీక్ చేసినందుకు..

    హెచ్​సీఏ వివాదంలో ఇటీవల అధ్యక్షుడు జగన్మోహన్​రావు (President Jaganmohan Rao)తో పాటు పలువురిని సీఐడీ అరెస్ట్​ చేసిన విషయం తెలిసింది. ఇందులో భాగంగా హెచ్​సీఏ జనరల్‌ సెక్రెటరీ దేవరాజు అరెస్ట్‌ చేసేందుకు సీఐడీ అధికారులు(CID Officers) ఏర్పాట్లు చేశారు. అయితే ఆ సమాచారాన్ని సీఐ ఎలక్షన్​రెడ్డి ముందుగానే దేవరాజు(Devaraju)కు చెప్పారు. దీంతో CID సమాచారాన్ని లీక్‌ చేసినందుకు సీఐపై సస్పెన్షన్‌ వేటు పడింది.

    CI Suspended | ఆరు రోజుల కస్టడీకి అనుమతి

    హెచ్​సీఏలో అక్రమాలకు పాల్పడిన కేసులో అరెస్టయిన అధ్యక్షుడు జగన్మోహన్​రావుతో పాటు మిగతా వారిని సీఐడీ కస్టడీకి తీసుకుంది. జ్యూడీషియల్​ రిమాండ్(Judicial Remand)​లో ఉన్న వారిని కస్టడీకి అప్పగించాలని సీఐడీ కొరగా మల్కాజిగిరి కోర్టు(Malkajgiri Court) ఆరు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో వారిని సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. నిధుల దుర్వినియోగం, ఇతర అక్రమాలపై అధికారులు విచారణ చేయనున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...